శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లాలో "రంగ్ దే" మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. నితిన్, వెంకీ అట్లూరి కాంబోలో రూపొందిన ఈ సినిమా మార్చి 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలోనే నితిన్ తన సినిమాని ప్రమోట్ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు. చెక్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఆయన మళ్లీ ఇంకొక డిజాస్టర్ అందుకునే పరిస్థితిలో లేరు. అందుకే ఆయన మునుపెన్నడూ లేని విధంగా తన సినిమాని ప్రచారం చేస్తున్నారు. కీర్తి సురేష్ తన సినిమాకి ప్లస్ అవుతుందని నితిన్ మొదటి నుంచే భావించారు. అలాగే ఆయన ఆమెతో కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేసే పనిలో నిమగ్నం అయ్యారు.


అయితే ప్రమోషన్లలో అతి ముఖ్యమైన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కీర్తి సురేష్ హాజరుకాలేదు. ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె కర్నూలు జిల్లా రాకపోయేసరికి నితిన్ కి షాక్ తగిలినట్లు అయిందట. ఆమె ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొని తన ముచ్చటైన మాటలతో సినిమాని ప్రమోట్ చేసినట్లైతే ప్రేక్షకుల రెస్పాన్స్ మరో స్థాయిలో ఉండేది. నితిన్ కూడా కీర్తి సురేష్ పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆమె అతడి ఆశలపై నీళ్లు చల్లారు. నిజానికి కీర్తి ఒక్కరే కాదు ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి డుమ్మా కొట్టారు. దీంతో నితిన్ ఒక్కరే ఒంటరిగా ట్రైలర్ లాంచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.


ఇదే విషయమై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నితిన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. "కీర్తి హ్యాండిచ్చింది, డైరెక్టర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. మా టీమ్ లో ఎవరూ రావట్లేదు ఏంటని నేను చాలా డల్ అయ్యాను. కానీ మీరు చాలా మంది వచ్చారు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. మీరంతా ఉన్న తర్వాత వాళ్ళు రాకపోతే ఏంటీ తొక్క? మీరు ఉన్న తర్వాత వాళ్లంతా వేస్ట్!!" అని నితిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: