ప్రేమిస్తే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి సంధ్య తర్వాత అన్నవరం మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సిస్టర్ గా నటించి మెప్పించింది. తర్వాత తమిళ మూవీస్ లో నటించి, 2005లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్ ని పెళ్లాడింది. ఈమెకు ఒక పాప ఉంది. అయితే తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆడియన్స్ కి దగ్గరైన కీర్తిరెడ్డి ఆతర్వాత అర్జున్ మూవీలో మహేష్ బాబుకి అక్కగా నటించింది. హీరో సుమంత్ ని పెళ్లాడిన ఈమె కొన్ని కారణాల వలన విడిపోయింది. తర్వాత మరోవ్యక్తిని పెళ్ళాడి అమెరికాలో సెటిలయింది.
తొలిప్రేమ సినిమాలోనే పవన్ చెల్లెలిగా నటించిన వాసుకి అదే సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని పెళ్ళాడి, సెటిలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాఖీ సినిమాలో చెల్లెలుగా నటించిన మంజూష తర్వాత కొన్ని సినిమాల్లో చేసి, యాంకర్ గా సెటిలైంది. ఇక ఒక్కడు మూవీలో మహేష్ బాబు చెల్లెలు పాత్రలో నటించిన నిహారిక బాగానే పేరుతెచ్చుకుంది. తర్వాత స్టడీస్ పై దృష్టిపెట్టిన ఈమె ఇప్పుడు సినిమాల్లో నటించడానికి సై అంటోంది.
ఇక శివరామరాజులో ముగ్గురు అన్నల ముద్దుల చెల్లెలుగా నటించిన మౌనిక ఆతర్వాత ఇస్లాం మతం స్వీకరించి, చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్ళాడి సెటిలయింది. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన హీరోయిన్ గా నటించిన శరణ్య మోహన్ కత్తి మూవీలో కళ్యాణ్ రామ్ చెల్లెలిగా నటించింది. తన ఫ్రెండ్ డాక్టర్ అరవింద్ కృష్ణను పెళ్ళిచేసుకుని సినిమాలకు దూరమైంది.