సూర్య తన భార్య నటి జ్యోతిక కోసం కొన్ని సినిమాలను నిర్మించారు. అయితే ఇప్పుడు తెలుగులో కొన్ని చిన్న సినిమాలను తన బ్యానర్ లో చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాల్లో సూర్య నటించరట. తెలుగు హీరోలనే పెట్టి సినిమాలను తీస్తారట. అంతే కాకుండా సినిమాలను నిర్మించడానికి తెలుగులో ఓ పార్ట్నర్ ను ను కూడా వెతుకుంటున్నారట. ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి సూర్య ఈ సినిమాలను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తొంది. ఇక సూర్య తెలుగులో ఏ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటారు...ఏ హీరోలతో సినిమాలు చేస్తారనే వివరాలు త్వరలోనే రాబోతున్నాయి. ఇదిలా ఉండగా సూర్య హీరోగా లాక్ డౌన్ సమయంలో వచ్చిన సినిమా సురరైపోట్రు. ఈ సినిమాకు విమర్షకుల నుండి ప్రశంసలు అందాయి. ఈ చిత్రాన్ని ఆకాశమే నీ హద్దురా పేరుతో తెలుగులో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం సూర్య పొన్నియిన్ సెల్వాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.