‘వకీల్ సాబ్’ విడుదల తేది దగ్గర పడుతున్న పరిస్థితులలో ఈమూవీని ప్రమోట్ చేస్తూ దర్శకుడు వేణు శ్రీరామ్ సంగీత దర్శకుడు తమన్ వరసపెట్టి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా తమన్ ఈసినిమా పై అంచనాలు పెంచుతూ అనేక ఆసక్తికర విషయాలు లీక్ చేస్తున్నాడు.


ఈమూవీ సెకండ్ హాఫ్ లో మాతృక మూవీ ‘పింక్’ మూవీలో లేని ఒక ట్విస్ట్ ఉంటుందని ఆ ట్విస్ట్ తో ‘వకీల్ సాబ్’ మూవీ మరో ఎత్తుకు చేరుకుంటుంది అని అంటున్నాడు. అంతేకాదు ఈమూవీలో లాయర్ పాత్రలో నటిస్తున్న పవన్ చెప్పే డైలాగ్స్ కు చప్పట్లతో ధియేటర్లు అదిరిపోతాయని ముఖ్యంగా ఈ మూవే డబ్బింగ్ సమయంలో ఆవేశంతో చెపుతున్న డైలాగ్స్ విన్నవారు ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ అప్పుడే తనకు లీకులు ఇస్తున్నారు అంటూ పవన్ అభిమానులకు జోష్ ను కలిగిస్తున్నాడు.



ఇప్పటివరకు ఈమూవీకి సంబంధించి విడుదలైన పాటలు అన్నీ సూపర్ హిట్ అయినందుకు తనకు ఆనందంగా ఉంది అని చెపుతూ అయితే ఈ మూవీని ధియేటర్ లో చూసిన ప్రేక్షకులు మాత్రం తన పాటల గురించి కాకుండా పవన్ నట విశ్వరూపం గురించి మాట్లాడుకుంటారని కామెంట్స్ చేసాడు. అంతేకాదు పవన్ అద్భుతమైన నటన ముందు తాను ఎంతో ఆలోచించి కష్టపడి చేసిన ఈ మూవీలోని పాటల ట్యూన్స్ తెలిపోతాయని అదే తనకు అసంతృప్తి అని అంటున్నాడు.


ఇదే సందర్భంలో మరొక ఆసక్తికర విషయం బయటపెడుతూ మొదట్లో ఈ మూవీకి ‘మగువా మగువా’ అన్న టైటిల్ పెట్టాలని భావించారని అయితే పవన్ ఇమేజ్ కి తగినట్లుగా ఈమూవీ టైటిల్ సరిపోదు కాబట్టి ఈమూవీకి ‘వకీల్ సాబ్’ అన్న టైటిల్ పెట్టిన విషయాన్ని బయటపెట్టాడు. ‘అల వైకుంఠ పురములో’ మూవీ ప్రమోషన్ లో ఆసినిమాలోని పాటలకు సంబంధించి మ్యూజిక్ ఫెస్టివల్ జరిగినట్లుగా ‘వకీల్ సాబ్’ మూవీ విషయంలో కూడ మ్యూజిక్ ఫెస్టివల్ ను తమన్ నిర్వహిస్తూ ఈమూవీ పై భారీ అంచనాలు పెంచుతున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: