చిరంజీవికి 65 సంవత్సరాలు బాలకృష్ణకు 60 సంవత్సరాలు దాటిపోయినా టాప్ హీరోలుగా తమ పరుగులు కొనసాగిస్తూనే ఉన్నారు. టాప్ యంగ్  హీరోలకు షాక్ ఇచ్చే విధంగా వీరిద్దరూ వరస పెట్టి భారీ సినిమాలు చేస్తున్నారు.  వీరి దూకుడుకు తగ్గట్టుగా వీరితో సినిమాలు చేయడానికి అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు  ప్రముఖ దర్శకులు క్యూ కడుతున్నప్పటికీ వీరి సినిమాలకుసంబంధించి  హీరోయిన్స్ దొరకడం పెద్ద సమస్యగా మారింది. భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తునప్పటికి చాలమంది టాప్ హీరోయిన్స్ బాలకృష్ణ చిరంజీవి లతో నటించడానికి ముందుకు రాకపోవడం అత్యంత ఆశ్చర్య కరంగా మారింది.

అయితే ప్రస్తుతం ఈ సీనియర్ హీరోల సమస్యలకు బాలీవుడ్ బ్యూటీ సోనక్షి సిన్హా పరిష్కారంగా మారడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.  తెలుస్తున్న సమాచారం మేరకు మైత్రి మూవీస్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణతో తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి హీరోయిన్ గా సోనక్షి సిన్హా తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కధకు సంబంధించిన కధలో హీరోయిన్ కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సోనక్షి ఈ మూవీలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ వార్తలు ఇండస్ట్రీ వర్గాలకు లీక్ కావడంతో రానున్నరోజులలో టాప్ సీనియర్ హీరోల సమస్యలకు  సోనాక్షి పరిష్కారం కాబోతుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి సోనక్షికి ఎప్పటి నుంచొ టాలీవుడ్ ఇండస్ట్రీ పై కన్ను ఉంది. గతంలో క్రిష్ మహేష్ తో తీయాలని ప్రయత్నించిన  ‘శివం’ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్పట్లో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు.

అయితే కొన్ని కారణాల రీత్యా అప్పట్లో ఆ మూవీప్రాజెక్ట్ మొదలుకాలేదు  ఆ తరువాత ఆమె రజనీకాంత్ తో ‘లింగ’ మూవీలో నటించి నప్పటికీ ఆ మవీ ఫెయిల్ కావడంతో ఆమె దక్షిణాది కలలు  నెరవేరలేదు. ఇప్పుడు ఒకసారి ఆమెకు బాలయ్య చిరంజీవిమూవీ ఆఫర్స్ ఆమెకు రావడంతో ఆమె త్వరలో తెలుగు సీనియర్ హీరోల సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: