ప్రస్తుతం మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యువ నటీ నటులు డైరెక్ట్ గా బిగ్ స్క్రీన్ పై కాకుండా.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ ల ద్వారా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని.. ఆ తర్వాత వెండితెరపై మెరిసారు.. అలా షార్ట్ ఫిలిమ్స్ తో తమ కెరీర్ మొదలుపెట్టి, యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి తర్వాత సినిమాలతో ఇంకా పాపులర్ అయిన కొంత మంది యాక్టర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

#1 చాందినీ చౌదరి

బ్రహ్మోత్సవం, మను, ఇటీవల వచ్చిన కలర్ ఫోటో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు.అందులో మధురం షార్ట్ ఫిలిం ద్వారా ఎంతో పాపులర్ అయ్యింది చాందిని..

#2 రాహుల్ రామకృష్ణ

అర్జున్ రెడ్డి, కల్కి, హుషారు, గీత గోవిందం ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన రాహుల్ రామకృష్ణ, సైన్మా షార్ట్ ఫిలింలో నటించారు. ఈ షార్ట్ ఫిలిమ్ కి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.

#3 విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగులో ఎంతో పాపులర్ అయ్యారు. అలాగే సైరా నరసింహారెడ్డి, ఉప్పెన ద్వారా స్ట్రెయిట్ తెలుగు సినిమాలలో కూడా కనిపిస్తున్నారు. కెరియర్ ప్రారంభంలో విజయ్ సేతుపతి షార్ట్ ఫిలింస్ లో నటించారు. అలాగే టీవీ సీరియల్ లో కూడా యాక్ట్ చేశారు.

#4 పూజిత పొన్నాడ


కల్కి, బ్రాండ్ బాబు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన పూజిత పొన్నాడ కూడా అను తను నేను, పరిచయం, దీపికా పదుకొనే ఇంకా ఎన్నోషార్ట్ ఫిలిమ్స్ లో నటించారు

#5 సుహాస్


ప్రతి రోజు పండగే, మజిలీ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించి, ఇటీవల కలర్ ఫోటో ద్వారా హీరోగా మన అందర్నీ అలరించిన సుహాస్ అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అందులో అతిధి షార్ట్ ఫిలిం ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు, అలాగే అతిధి షార్ట్ ఫిలింలో తన పెర్ఫార్మెన్స్ కి ఎందరో సెలబ్రిటీల నుండి ప్రశంసలు అందుకున్నారు.

#6 రీతు వర్మ

పెళ్లిచూపులు, కేశవ సినిమాల్లో నటించిన రీతు వర్మ, అనుకోకుండా అనే షార్ట్ ఫిలిం నటించారు.

#7 విశ్వక్ సేన్

ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్, హిట్ సినిమాలతో పాపులర్ అయిన విశ్వక్ సేన్ పిట్టకథ అనే షార్ట్ ఫిలిం లో నటించారు.

#8 నవీన్ పోలిశెట్టి

నవీన్ పోలిశెట్టి AIB లో ఎన్నో వీడియోస్ లో నటించారు. అందులో ఇంజినీరింగ్ గురించి చేసిన ఒక వీడియో ద్వారా నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించారు.

#9 రాజ్ తరుణ్

ఉయ్యాల జంపాల, రాజుగాడు, కుమారి 21ఎఫ్, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన రాజ్ తరుణ్ అంతకు ముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.

#10 ప్రియాంక జవాల్కర్

టాక్సీవాలా ద్వారా మనందరికీ పరిచయమైన ప్రియాంక జవాల్కర్ పొసెసివ్ నెస్, ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

#11 విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఒక తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా వేరే భాష ఇండస్ట్రీలలో కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షార్ట్ ఫిలిం లో నటించారు.

#12 హర్ష చెముడు (వైవా హర్ష)

ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన హర్ష, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు...ఇప్పటికీ యూట్యూబ్ లో హర్ష నటించిన షార్ట్ ఫిలిమ్స్ ని చూస్తుంటారు ఆడియన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: