![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/nithin-6fb22ca3-13bb-4864-9171-ad41441e11b1-415x250.jpg)
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత నెల క్రితమే ఓ డిఫరెంట్ జోనర్ పై తెరకెక్కిన చెక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలై..ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.. ఇదిలా ఉంటె ఇప్పుడు తాజాగా మరో లైవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రెడీ అయిపోయాడు ఈ హీరో.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం రంగ్ దే.. సీనియర్ నటులు నరేష్, రోహిణి తదితరులు నటించిన ఈ సినిమా మార్క్ 26 అనగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది..ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం..
కథ విషయానికొస్తే;
ఎప్పుడూ పక్క పక్కనే ఉండే ఓ రెండు కుటుంబాల కథ ఇది.. ఒకరంటే ఒకరికి పడని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మధ్య వ్యవహారం పెళ్లిదాకా వస్తే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేదే ‘రంగ్‌దే’ కథ...
విశ్లేషణ విషయానికొస్తే...
కథలో కొత్తదనం ఏమిలేదు కానీ తెరపై చూపించిన విధానం బాగుంది. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా కథనాన్ని సాగించాడు..డైరెక్టర్ వెంకీ.. తాను చెప్పాలనుకున్న పాయింట్ ఎమోషనల్ గా చెప్పాలనుకున్నప్పటికిఅది అంతగా వర్కౌట్ కాలేదని చెప్పాలి.. ఇక సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడిని అలరిస్తాయి. అను, అర్జున్ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి.. అయితే స్లో నెరెషన్ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో సినిమానే బాగానే నడిపిన, సెకండాఫ్ కాస్త దెబ్బ కొట్టించినట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. కథంతా రోటీన్‌గా సాగడం, దానికి తోడు ప్రతి సన్నివేశం పాత సినిమాలను గుర్తుకు తెస్తుంది.ఇక ఈ సినిమాకు ప్రధాన బలం దేవి శ్రీ ప్రాసాద్ సంగీతం. ప్రతి పాట ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది..ఇక సెకండాఫ్‌లోని చాలా సన్నివేశాలను ఇంకాస్త కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతి సీన్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి..మొత్తానికి సినిమా కథ రొటీన్ అయినప్పటికీ నితిన్, కీర్తీ ల మధ్య జరిగే వార్ మాత్రం యూత్ ఆడియన్స్ ను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు...
ప్లస్ పాయింట్స్ :
నితిన్, కీర్తీ ల యాక్టింగ్
కామెడీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
సెకండాఫ్ లో కొన్ని సాగదీత సీన్లు
స్లో నేరేషన్
ఎమోషనల్ సీన్స్