తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా, ఓ గైడ్ కొందరు టూరిస్టులను ఉద్దేశించి చార్మినార్ ను చూపెడుతూ.."దేశం నాలుగు దిక్కుల నుంచి టూరిస్టులు వస్తుంటారు... అందుకే దీనిని చార్మినార్ అంటారు. రోడ్లు విశాలంగా ఉండటం వల్ల ఇక్కడ కట్టేసారని చెబుతుండగా... అంతలో ఆటోడ్రైవర్ వచ్చి నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి వ్యాపించి, తగ్గడంతో ఆ వ్యాధికి చిహ్నంగా ఇక్కడ చార్మినార్ కట్టిచారని చెబుతాడు. ఇంతలో ఆ టూరిస్టులలో ఒకరైన ఇంత తెలిసి ఇక్కడ ఏంటి అని అడగగా.. అందుకు ఆటోడ్రైవర్ బ్రతకాలి కదా సార్ అంటాడు కట్ చేస్తే..
మరి గెలుపును వెతకాలి కదా సార్" ఇక్కడ కథ మీది కల మీది.. ఆట నాది కోటి మీది... రండి గెలుద్దాం" అంటూ చివర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఎవరి మీలో కోటీశ్వరుడు కార్యక్రమం ఈనెల 29న రాత్రి 8:15 నిమిషాలకు మీ లైఫ్ ని మార్చుబోయే మొదటి ప్రశ్నను ఎన్టీఆర్ అడగనున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి సంబంధించిన సరికొత్త ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అందరిని ఆకట్టుకుంటుంది.