మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. చ‌ర‌ణ్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాతో చివ‌ర‌గా ప్రేక్ష‌కుల‌ను అలరించారు. ఈ సినిమా చెర్రీ త‌న న‌ట‌న‌తో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చారు. ఇదివ‌ర‌కు కూడా చ‌ర‌ణ్ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ లు ఉన్న‌ప్ప‌టికీ రంగ‌స్థ‌లం మాత్రం ఆయ‌న కెరీర్ లో బెస్ట్ ప‌ర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాగా నిలిచింది. దాంతో సినిమాలో చ‌ర‌ణ్ న‌ట‌న‌కు విమ‌ర్ష‌కుల ప్ర‌శంస‌లు అందాయి. ఇక ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చ‌ర‌ణ్..మెగాస్టార్ హీరోగా తెర‌కెక్కితున్న ఆచార్య సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సినిమాలో తండ్రితో క‌లిసి దాదాపు రాంచ‌ర‌ణ్ ముప్పై నిమిషాల పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక ఇప్ప‌టికే ఆచార్య సినిమాలో చ‌ర‌ణ్ త‌న షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. అంతే కాకుండా ఇప్ప‌టికే త‌మిళ‌ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో ఓ ప్యాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

ఓ పొలిటిక‌ల్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న త‌ర‌వాత రామ్‌చ‌ర‌ణ్ ఈ ప్రాజ‌క్టును మొద‌లు పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సెల‌బ్రెష‌న్స్ ను నిన్న ఫ్యాన్స్ తో క‌లిసి జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీపెద్ద‌లు మెగాహీరోలు హాజ‌ర‌య్యారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రామ్ చ‌ర‌ణ్ త‌మ బ్యాన‌ర్ లో రంగ‌స్థ‌లం చేసి పెద్ద హిట్ ఇచ్చార‌ని అన్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ మ‌రో సినిమా చేస్తే బాగుంటుంద‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు న‌వీన్ ఎర్నెని వ్యాఖ్య‌లు చ‌ర్చ‌గా మారాయి. ఇప్ప‌టికే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ తో నిర్మాత‌లు ఓ సిసినిమా ప్లాన్ చేసి ఉంటారని అందువ‌ల్లే న‌వీన్ అలాంటి కామెంట్లు చేసి ఉంటార‌ని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: