సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎలా ఎవరి జీవితంలో సక్సెస్ అనేది వస్తుందో ఎవరికి తెలియదు ఒక హీరోకి ఒక సినిమాతో హిట్ వస్తే మరొక హీరోకి ఎన్నో సినిమాలు తీస్తే గాని హిట్ అందదు. రాత్రికి రాత్రే సెలెబ్రిటీలుగా మారిన చాలామంది గురించి మనం ఎన్నో సందర్భాల్లో వినే ఉంటాము. ఒక విధంగా చెప్పాలంటే అది వాళ్ళ అదృష్టం. అలాగే మన టాలీవుడ్ లో కొంతమంది హీరోలు కూడా ఒకే ఒక్క బ్రేక్ వస్తే చాలు.. మళ్ళీ ఫార్మ్ లోకి వస్తామంటున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఒక లుక్ వేద్దామా. !
ఎన్ని సినిమాలు చేసినాగాని హిట్ రాకపోవడంతో బ్రేక్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్న హీరోల్లో మొదటగా లవర్ బాయ్ రాజ్ తరుణ్ పేరు చెప్పవచ్చు. ఈ కుర్ర హీరో హిట్ కోసం నానా పాట్లు పడుతున్నాడు. ఈ ఇమేజ్ నుంచి బయటకు రావాలంటే రాజ్ తరుణ్ కి అర్జెంటుగా హిట్ కావాలి. ఒరేయ్ బుజ్జిగా సినిమాలతో పాటు ఈ మధ్య వచ్చిన పవర్ ప్లే కూడా ఫ్లాప్ అయ్యింది. .అలాగే మరొక యంగ్ హీరో సందీప్ కిషన్.డిఫరెంట్ సినిమాలను సెలక్ట్ చేసుకునే సందీప్ కిషన్ కూడా ప్లాపుల్ని ముట కట్టుకున్నాడు.. నిజానికి తెలుగులో హిట్ కొట్టి చాలారోజులైంది సందీప్. ఒకే ఒక్క బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ హీరో నెక్ట్స్ 2 సినిమాలతో రెడీ అవుతున్నారు.
అలాగే మంచు వారి అబ్బాయి మంచు విష్ణు పరిస్థితి కూడా ఇంతే రూ. 50 కోట్ల భారీ బడ్జెట్ తో రీసెంట్ గా విడుదల అయిన మోసగాళ్లు సినిమా అనుకున్న హిట్ ఇవ్వలేదు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో కూడా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇకపోతే సాయికుమార్ కొడుకు ఆది కూడా ఇంతే .తీసిన ప్రతి సినిమా ప్లాప్ అవుతూనే వస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన శశి సినిమా కూడా ఎక్స్ పెక్ట్ చేసిన హిట్ అందుకోలేకపోయింది. అలాగే శ్రీవిష్ను కూడా అంతే .. బ్రేక్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా చేసిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ గాలి సంపత్ కూడా ఫ్లాప్ అయ్యింది. చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్న సుమంత్ పరిస్థితి కూడా ఇంతే. రీసెంట్ గా కపటధారి అనే క్రైమ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఎలాగయినా హిట్ కొట్టాలని అనగనగా ఒక రౌడీ సినిమాలో వాల్తేరు శీను గా ప్రేక్షకులకు కొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు సుమంత్ .రాబోయే సినిమాల్లో వీళ్ళ లక్ ఎలా ఉంటుందో చూడాలి మరి... !!