బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 4లో ఎంతో మందికి ఫేవ‌రెట్ గా నిలిచిన కంటెస్టెంట్స్ అఖిల్, మోనాల్ గ‌జ్జ‌ర్‌. అఖిల్ ప‌లు సీరియ‌ల్స్ లో న‌టించి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మోనాల్ గ‌జ్జ‌ర్ తెలుగులో అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన సుడిగాలి సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఆ త‌ర‌వాత గుజ‌రాతిలో కొన్ని సినిమాలు, వెబ్ సిరిస్ ల‌లో న‌టించింది. అయితే ఈ ఇద్ద‌రికీ కూడా బిగ్ బాస్ తోనే ఎక్కువ పాపుల‌రీటీ వ‌చ్చింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మోనాల్ మ‌ధ్య కెమిస్ట్రీ చ‌క్క‌గా ఉండ‌టంతో అభిమానులు వీరికి ఫ్యాన్స్ అయ్యారు. కొంత మంది ప్రేక్ష‌కులు అయితే కేవ‌లం అఖిల్ మోనాల్ కోస‌మే షో చూసేవారు. మోనాల్ కోసం అఖిల్ మాట్లాడ‌టం. ఆమెను డిఫెండ్ చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసింది. అంతే కాకుండా మోనాల్ కూడా అఖిల్ కు స‌పోర్ట్ చేయడంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని అంతా అనుకున్నారు. కానీ అనేక సంద‌ర్బాల్లో ఈ విష‌యంపై మోనాల్ ను ప్ర‌శ్నించ‌గా తాము జ‌స్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది.

ఇక బిగ్ బాస్ నుండి భ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత కూడా ఈ జంట ప‌లు టీవీ షోల‌లో సంద‌డి చేసింది. అంతే కాకుండా ఇద్ద‌రికీ క‌లిసి ఒక సినిమా ఆఫ‌ర్ కూడా రావ‌డంతో ఓకే చెప్పేశారు. గుజ‌రాతి అమ్మాయి తెలుగ‌బ్బాయి పేరుతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తయ్యాయి. ఇదిలా ఉండ‌గా హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత అఖిల్ మోనాల్ కు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ విప‌రీతంగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఫ్యాన్స్ కోరిక మేర‌కు ఇద్ద‌రూ క‌లిసి అనేక సార్లు లైవ్ లోకి కూడా వ‌చ్చారు. అయితే తాజాగా అఖిల్ మోనాల్ గ‌జ్జ‌ర్ తో మాట్లాడిన వీడియోకాల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసారు. అంతే కాకుండా ఓ క‌విత కూడా రాసి అంద‌రికీ షాక్ ఇచ్చారు. ప్రేమ క్యాన్సర్ లాంటిది...అది మ‌ర్చిపోయేలా చేస్తుంది. చివ‌రికి ప్రాణం కూడా తీస్తుంది. అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ప్ర‌స్తుతం అఖిల్ పోస్ట్ వైర‌ల్ అవుతోంది.









మరింత సమాచారం తెలుసుకోండి: