1987 లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి జంటగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు "సామ్రాట్"అనే టైటిల్ ను చిత్రబృందం ఫిక్స్ చేసి అందుకు సంబంధించిన పోస్టర్లను, రిలీజ్ తేదీలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ సామ్రాట్ అనే సినిమాను నిర్మించాడు. అయితే బాలకృష్ణ నటించిన సినిమా సామ్రాట్,రమేష్ బాబు నటించిన సినిమా టైటిల్ కూడా సామ్రాట్ కావడంతో ఎన్టీఆర్, కృష్ణల మధ్య టైటిల్ వివాదం తలెత్తింది.
ఇద్దరు టైటిల్ నాదంటే నాది అని గొడవ పడ్డారు. చివరకు ఎన్టీఆర్ ఒక అడుగు వెనక్కి వేస్తూ బాలకృష్ణ నటించిన సినిమాకి "సాహస సామ్రాట్"అనే టైటిల్ పెట్టి తన హుందాతనాన్ని చాటుకున్నారు. ఇక ఈ రెండు సినిమాలు విడుదల కావడంతో బాలకృష్ణ, విజయశాంతి నటించిన సాహస సామ్రాట్ బాక్సాఫీస్ దగ్గర మోస్తారు కలెక్షన్లను రాబట్టగా, రమేష్ బాబు నటించిన సామ్రాట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది.