టీవీ షోస్, సినిమాలు, సోషల్ మీడియా పోస్ట్‌లతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచే అనసూయ హోలీ సందర్భంగా పొట్టి బట్టలు ధరించి తన ఫ్యామిలీతో ఈ వేడుక ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఇవి తెగ వైరల్ అవుతున్నాయి..ఈ ఫోటోల్లో అనసూయ పొట్టి దుస్తుల్లో కనిపించడం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది.. అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో కలిసి సందడి చేస్తోంది. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలొ రూపొందుతున్న ఖిలాడి మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది..
అలానే మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఈ క్రమంలో అనసూయ తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.ఇక తాజాగా మలయాళంలో కూడా ఆమెకు ఓ సినిమా అవకాశం దక్కింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం 'భీష్మ పర్వం'లో ఓ కీలక పాత్ర కోసం ఎంపికైంది అనసూయ..ఇక ఇటీవలే ఈ భామ కార్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా అనే సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించింది.. సినిమా హిట్ అవ్వకపోయిన అనసూయ ఐటమ్ సాంగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!