తెలుగులో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సమ్మోహనం చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది అదితి రావ్ హైదరి.. ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. మంచి హిట్ సాధించింది. ఆమె నటనకు సైతం ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా అంతరిక్షంలో నటించింది. ఇటీవల నానితో 'V' చిత్రంలో హీరోయిన్ గా చేసింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం అనే మూవీ చేస్తున్నట్లు ఆమె తాజాగా తెలిపారు. ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా ఆమె నటిస్తున్నారు. 

వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది..ఇక అదితి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలకోస్తే...28 అక్టోబర్ 1986న హైదరాబాద్ లో అదితి జన్మించింది. అదితి అమ్మ, నాన్న కూడా రాజకుటుంబానికి చెందిన వారే. ఆమె తండ్రి అస్సాంకు చెందిన మహ్మద్ సలెహ్ అక్బర్ హైదరీ రాజ కుటుంబీకుడు. ఆమె తల్లి వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావుకు కుమార్తె. అంతేకాదు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు అదితి కజిన్. ఈ రాజ కుటుంబానికి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

ఆంధ్రప్రశ్‌లోని మదనపల్లె రిషీ వ్యాలీ స్కూల్ లో అదితి చదివింది. ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకుంది. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ కంప్లీట్ చేసింది. సినిమాల మీద ఉన్న ఆసక్తితో డిగ్రీ కాగానే.. ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. పలు హిందీ, తమిళ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ మంచి అవకాశాలు దక్కించుకుంది. అద్భుత నటనతో గుర్తింపు తెచ్చుకుంది.ఈమెకి 17 సంవత్సరాలకే పెళ్లి అయ్యింది. సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ నటుడితే ప్రేమలో పడింది. అతడితో కొన్నాళ్లు ప్రేమలో గడిపింది. 2009లో మిశ్రాని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి చాలా కాలం నిలవలేదు. కేవలం నాలుగు ఏండ్లకే అతడితో విడాకులు తీసుకుంది..ఇక ప్రస్తుతంమాత్రం అన్నింటినీ పక్కనపెట్టి సినిమాలపైనే దృష్టి సారించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: