పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఏప్రిల్ 9 న 'వకీల్ సాబ్’ గా థియేటర్స్ లో సందడి చేయనున్నారు. ఈ చిత్రం మీద పవన్ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం చూస్తామా అని రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. దాదాపు మూడు సంవత్సరాలు తరువాత పవన్ నటించిన సినిమా ఇదే అవ్వడం విశేషం అని చెప్పాలి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి విశేష స్పందన వచ్చింది.ఈ క్రమంలోనే వకీల్ సాబ్ ట్రైలర్ చూసి అసలు సినిమా భవిష్యత్ ఏంటి?ఈ సినిమా హిట్ అవుతుందా.. లేదా అన్నదానిపై తన దైన శైలిలో ఒక క్లారిటీ ఇచ్చారు మన  సీనియర్ రైటర్, డైరెక్టర్ అయిన పరిచూరి గోపాలకృష్ణ. పరుచూరి పాఠాలు ద్వారా సినిమాలపైన,  ఇండస్ట్రీపైన తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే  తాజాగా వకీల్ సాబ్ చిత్రం గురించి విశ్లేషణ అందించారు.మరి ఆయన వకీల్ సాబ్ సినిమా గురించి ఏమన్నారో తెలుసుకుందాం.. !!



మన పెద్ద వాళ్ళు ఒక సామెత చెబుతారు గుర్తు ఉందా.. అన్నం అంతా ఉడికిందో లేదో చూడాలంటే మొత్తం అన్నం చూడాల్సిన పనిలేదు.రెండు మూడు మెతుకులు చూస్తే సరిపోతుంది అని. అలాగే వకీల్ సాబ్ ట్రైలర్ చూశాక నాకు ఇదే అనిపించింది. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం వలన మీరు అలా అంటున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ.. మన దగ్గర రెండున్నర గంటల సినిమా ఉన్నప్పుడు దాన్ని ట్రైలర్‌లో చూపించడం అనేది చిన్న విషయం కాదు.మొత్తం సినిమా స్టోరీని బయట పెట్టకుండా ముఖ్యమైన సన్నివేశాలతో మాత్రమే ట్రైలర్ చూపించడం అంటే కష్టమైన పనే. అలాగే  హీరో గెటప్.. అతని నేపథ్యం ఏంటన్నది కూడా వకీల్ సాబ్ ట్రైలర్‌లో చూపించలేదు. కాబట్టి ఖచ్చితంగా అతనికి మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అర్థమైంది. ముఖ్యంగా ఈ సినిమా సారాంశం ఏంటంటే ఒక బలహీనురాలిపై ఒక బలవంతుడు చేస్తున్న కుట్రనుంచి కాపాడటానికి ఒక సింహం వచ్చింది.. ఆ సింహమే మన పవన్ కళ్యాణ్. సింహం వచ్చిన తరువాత కథ అయిపోతుంది అనుకుంటే పొరపాటు పడినట్లే. కానీ అతనికి ఎదురుగా మరొక సింహాన్ని పెట్టారు.అతనే ప్రకాష్ రాజ్.రెండు సింహాలు తలపడితే చూడడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తి చూస్తారు. అలాగే ఈ సినిమాలో లాయర్ నంద.. ఓ ఆడపిల్లను కోర్టులో నువ్ కన్యవేనా అని అడగడంతో ట్రైలర్‌ స్టార్ చేశారు. ఒక ఆడపిల్లని అలా అడిగితే ఆ ఆడపిల్ల ఏమి సమాధానం చెప్తుంది చెప్పండి. ఆ పిల్లని ఏమి ఒక రూమ్ లో నుంచోపెట్టి అడగలేదు. కోర్టు బోనులో నుంచోబెట్టి అందరి ముందు అడగడానికి గల కారణం గురించి ఆలోచించాలి. అలాగే చివర్లో పవన్ కళ్యాణ్ కూడా బలవంతుడిగా ఉన్న ఆ అబ్బాయిని  అదే ప్రశ్న వేశాడు.. నువ్వ్ వర్జిన్‌వా అని. నందా.. అబ్జెక్షన్ అని లేస్తున్నాడు.. మీరు అమ్మాయిని అడగొచ్చు.. అబ్బాయిని అడగకూడదా.. ఇదేక్కడ రూల్ అండి అన్నా పవన్ కళ్యాణ్ డైలాగ్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుందో రేపు థియేటర్స్‌లో చూడొచ్చు..


సినిమా ట్రైలర్ చూసినప్పుడు కథ ఏంటో అర్థం అయిపోతుందని భయపడొద్దు. కథ అర్థం అయినా.. ఎలా సాధిస్తారు అనే ఉత్కంఠను ట్రైలర్ లో చూపించారు. అది చాలు సినిమా ఎంత అద్భుతంగా ఆడుతుంది అనడానికి  ఉదాహరణ.
అలాగే ఈ సినిమా టైటిల్ సినిమాకి ఒక మంచి క్రెజ్ తెచ్చింది. ఎందుకంటే అంతకుముందు లాయర్ బ్యాడ్రాప్ లో వచ్చిన సినిమాలకు లాయర్ విశ్వనాథం.. లాయర్ సుహాసిని ఇలా క్యారెక్టర్ పేర్లతో సినిమా టైటిల్ పెట్టేవాళ్లం.కానీ  పవర్ స్టార్ పేరుకి కూడా లాయర్‌ని యాడ్ చేసి పెట్టొచ్చు. కానీ చాలా చక్కగా వకీల్ సాబ్ అని మాత్రమే పెట్టించుకోవడంలోనే సినిమా గొప్పతనం అర్ధం అవుతుంది. వకీల్ సాబ్ సినిమా అనేది ఒక కోర్ట్ రూం డ్రామా అని చెప్పవచ్చు. సినిమాలో పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నప్పుడు చాలా కొత్తగా నటించాడనే అనిపించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని అనిపిస్తుంది.డౌట్ లేదు.  ఈ సినిమా అద్భుతంగా ఆడబోతుంది.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఒక చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నా’అని  పరుచూరి గోపాలకృష్ణ  వకీల్ సాబ్ ట్రైలర్ చూసి సినిమాకి రివ్యూ ఇచ్చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: