ఇండస్ట్రీలో అందరికి అదృష్టం కలిసి రాదు. కొందరికి ఒక్క సినిమాతోనే గుర్తింపు వస్తే.. మరికొందరికి కే=రెండో సినిమాతో గుర్తింపు తెచ్చుకుంటారు. వాళ్ళ తొలి సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా రెండో సినిమా మాత్రం బ్లాక్‌బస్టర్ కొట్టి ఔరా అనిపించారు. రాజమౌళి నుంచి ఇప్పటి జాతి రత్నాలు అనుదీప్ వరకు అలా రెండో సినిమాతో మాయ చేసిన దర్శకులు ఎవరో చూద్దాం.

అనుదీప్ పిట్టగోడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మంచి గుర్తింపు రాలేదు. ఈ సినిమా తరువాత అనుదీప్ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో మంచి, పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. వివేక్ ఆత్రేయ మెంటల్ మదిలో సినిమాను చిత్రీకరించారు. బ్రోచేవారెవరురా సినిమాతో మంచి, పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీను వైట్ల నీ కోసం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. కానీ ఆనందం సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

కొరటాల శివ ఇండస్ట్రీకి మిర్చి సినిమాతో పరచయమైయ్యారు. కానీ శ్రీమంతుడు సినిమాతో ఎక్కువ గుర్తింపు వచ్చింది. రాజమౌళి స్టూడెంట్ నెం 1 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. సింహాద్రి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో సరైన గుర్తింపు రాలేదు. బృందావనం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గౌతమ్ తిన్ననూరి మళ్ళీ రావా సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మంచి గుర్తింపు రాలేదు. జెర్సీ సినిమాతో మంచి, పేరు గుర్తింపు తెచ్చుకున్నారు.

హరీష్ శంకర్ షాక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మంచి గుర్తింపు రాలేదు. మిరపకాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హను రాఘవపూడి ఇండస్ట్రీకి అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: