సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ల పరంగా యాక్టింగ్, డాన్స్, కామెడీ, ఇలా అన్నింటిలో కొంతమంది హీరోయిన్లు రాణించలేకపోతూ ఉంటారు. కానీ సాయిపల్లవి విషయానికి వస్తే అన్నింటి పరంగా ఓకే అనిపించేలా చేస్తోంది . అంతేకాకుండా తెలుగుతో పాటు తమిళ , మలయాళ భాషల్లో ఇలా అన్ని సినిమాల్లో కూడా సాయి పల్లవి నటిగా మంచి పేరు గుర్తింపు పొందింది. ఆ పేరు, గుర్తింపు ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాతల పాలిట వరమవుతోంది.
సాయి పల్లవి కి బహుభాషా నటిగా గుర్తింపు ఉండడంతో, ఆమె సినిమాలను ఇతర భాషల్లోకి విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.అంతే కాకుండా లవ్ స్టోరీ సినిమా తెలుగులో ఈనెల 16న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శక నిర్మాతలు కన్నడ, మలయాళ భాషల్లో కూడా లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.
కానీ నాగచైతన్యకు తెలుగులో క్రేజ్ బాగానే ఉన్నా, ఇతర భాషల్లో పెద్ద గుర్తింపు లేదు. అయితే హీరోయిన్ సాయి పల్లవి కి మాత్రం ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉండడంతో నిర్మాతల పాలిట వరం అవుతోంది. ఇతర భాషల్లో రిలీజ్ కావడానికి కారణమవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు "సైతంసారంగదరియా" పాట ఎంతగానో నచ్చేసిందట. ఈ భాష ఆ భాష అనే తేడా లేకుండా అన్ని భాషలలోనూ బ్లాక్ బాస్టర్ హిట్టయిన సారంగదరియా పాట 10 కోట్ల వ్యూస్ ని అందుకోవడం గమనార్హం.
అంతేకాకుండా ఇతర భాష అయినటువంటి తమిళంలో కూడా సాయి పల్లవి కి మంచి క్రేజ్ ఉంది. తెలుగు,మలయాళ,కన్నడ భాషల్లో హిట్టయితే లవ్ స్టోరీ సినిమా తమిళ్ లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిదా తర్వాత కొత్త వాళ్లతో లవ్ స్టోరీ షూటింగ్ స్టార్ట్ చేసిన శేఖర్ కమ్ముల అవుట్ ఆఫ్ స్థాయిలో లేకపోవడం తో నాగచైతన్య, సాయి పల్లవి ని తీసుకొని రీషూట్ చేశారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు భారీ లాభాలు రావడం గమనార్హం. అందుకే సాయి పల్లవి అన్ని భాషల్లోనూ చక్కగా రాణిస్తోంది.