మళ్ళీ 'Rgv దెయ్యం' అనే మరో కొత్త దెయ్యం కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ హీరో అయిన రాజశేఖర్ హీరోగా నటిస్తున్నాడు అలాగే కొన్ని ముఖ్యమైన పాత్రలలో స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి ప్రముఖ నటులు సైతం ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న మొత్తం 5 భాషల్లో అంటే తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ,హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చారు
ఈ సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..Rgv దెయ్యం సినిమా వెండి తెర ప్రమోషన్స్ స్టార్ట్ చేశామని చెప్పారు. అలాగే బాలీవుడ్ లో 'బ్రేకప్'లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో సీనియర్ నటుడు రాజశేఖర్ గారికి కూతురి పాత్రలో నటించినట్లు చెప్పారు. అలాగే ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లో నటించారని అంటూ 'Rgv దెయ్యం' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న 5 భాషలలో విడుదలవుతున్నట్లు వివరణ ఇచ్చారు.ఇక ఈ సినిమాను చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.