అయితే అనుకోకుండా అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత ఆపై తన రాజకీయ జీవితంలో నిమగ్నమైపోయారు పవన్ కళ్యాణ్. ఇక ఇటీవల వకీల్ సాబ్ మూవీ ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ మరొక మూడు రోజుల్లో ఆ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్నారు. పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ఫుల్ లాయర్ పాత్ర పోషిస్తుండగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. దిల్రాజు, బోనికపూర్ కలిసి ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేదాథామస్, అనన్య నాగళ్ళ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా తమన్ సంగీతాన్ని పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. మరో వైపు ఈ సినిమాకు సంబంధించి చాలా ఏరియాల్లో ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవడం అలానే చాలా ప్రాంతాల్లో కూడా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవడం జరిగిపోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ మూవీ యొక్క ఓవర్సీస్ ప్రీమియర్స్ పరంగా కూడా భారీగా కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో కొనసాగుతుండటం అలానే అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ తో కొనసాగించడంతో అదే విధంగా ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతుండడంతో 50% ఆక్యుపెన్సీ తో థియేటర్స్ రన్ అయినా అవ్వొచ్చని అంటున్నారు. ఒకవేళ అదేమి లేకుంగా ఫుల్ సీటింగ్ ఉన్నప్పటికీ సినిమా మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంటే మొదటి మూడు రోజుల వరకు యువత, మాస్ ప్రేక్షకులు వచ్చినా ఆపై ఫ్యామిలీ ఆడియన్స్ వస్తేనే కానీ సినిమా నడవదని మరి కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో దానిని ఎదిరించి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చి వకీల్ సాబ్ చూస్తారా లేదా అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సినిమా పూర్తి స్థాయిలో విజయాన్ని ఎంతవరకు అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు......!!