నాగ చైతన్య,
సాయి పల్లవి నటించిన
లవ్ స్టోరీ సినిమా గతేడాది వేసవికాలంలో విడుదల కావాల్సి ఉంది. ఐతే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో ఈ
మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడింది. సంవత్సర కాలం పాటు వాయిదా పడిన ఈ
మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 16న తేదీన ఉగాది
పండుగ సందర్భంగా విడుదలకు ముహూర్తం పెట్టుకుంది. కానీ మళ్లీ
కరోనా వైరస్ రెండవ దశలో విజృంభిస్తుండడంతో తమ సినిమాపై ప్రభావం పడుతుందని భావించిన చిత్రబృందం ఏప్రిల్ 16న
సినిమా విడుదల చేయడం లేదని ప్రకటించింది. దీంతో
అక్కినేని అభిమానులు ఉసూరు మన్నారు. దాని పేరే సారంగధరియా అంటూ
మంగ్లీ పాడిన పాట కూడా ఎన్నో రికార్డును సృష్టించగా.. సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కానీ
శేఖర్ కమ్ముల
సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
అయితే ఉగాది
పండుగ రోజు టక్
జగదీష్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ దర్శకుడు
శివ నిర్వాణ నాని సినిమా విడుదల తేదీని మార్చాలని యోచిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
లవ్ స్టోరీ సినిమా తో పాటు
కంగనా రనౌత్ నటించిన
తలైవి సినిమాకూడా కరోనా దెబ్బకు వాయిదా పడింది. ఆచార్య
సినిమా రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం ఉంది. అయితే ముందుగా అనుకున్న మంచి తేదీలలో భారీ సినిమాలు విడుదలకు సిద్ధం కాకపోవడంతో.. చిన్న సినిమాలు రిలీజ్ కి క్యూ కడుతున్నాయి.
రాంగోపాల్ వర్మ ,
హీరో రాజశేఖర్ కాంబోలో రూపొందిన దయ్యం
సినిమా ఉగాది
పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన 99 సాంగ్స్
సినిమా కూడా ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ 2 సినిమాలతో పాటు
చెక్ మేట్, ఇట్లు
అంజలి, సర్వం సిద్ధం, టెంప్ట్
రాజా వంటి నాలుగు చిన్న సినిమాలు ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతున్నాయి. అయితే
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం కనీసం రెండు వారాల వరకు బాక్సాఫీస్ ని షేక్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిన్న సినిమాలు సక్సస్ అవుతాయా లేదా అనేదే అసలైన ప్రశ్న.