![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/mohan-lala7e32bc1-1a2a-46ad-93d4-f353b614ebac-415x250.jpg)
నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది.. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల్లో రెండు ఇప్పటికే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.. ట్రైలర్ అంచనాలను పెంచింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో అఖిల్ నెక్స్ట్ సినిమా గురించి అందరి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఫలితంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖిల్.. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది..
సైరా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా లో సూపర్ మోహన్ లాల్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది. యంగ్ ముంబై మోడల్ వైద్య సాక్షి ఈ చిత్రంలో అఖిల్ ప్రేయసిగా కనిపించనుంది. అనీల్ సుంకర .. సురేందర్ రెడ్డి సురేందర్ 2 సినిమా బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.