అందుకే ఆలీతో సరదాగా అనే కార్యక్రమం వస్తుంది అంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే గత వారం టాలీవుడ్లో యూత్‌ఫుల్ దర్శకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవల వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ చిత్రంలో సీనియర్ నటి గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న కృష్ణవేణి డబ్బింగ్ జానకి తో కలిసి ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా నెటిజన్లను ఆకర్షిస్తోంది
తన బాల్యంలో తాను చేసిన సాహసాలు నటప్రస్థానం గురించి ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో చెప్పుకొచ్చారు నటి కృష్ణవేణి. అంతేకాదు పదేళ్లకే తనకు పెళ్లి కూడా జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇలా పదేళ్లకే పెళ్లి జరిగిపోవడంతో తోటి వాళ్ళు అందరు కూడా ఎంతగానో ఏడిపించే వాళ్ళని .. నటి కృష్ణవేణి చెప్పుకొచ్చారూ. పదేళ్ల వయసులోనే ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు నటి కృష్ణవేణి. తన వివాహం కిల్లి సంగతులు చెబుతూ ఏకంగా నవ్వులు పంచుకున్నారు. కాగా ఎపిసోడ్ మొత్తం 19వ తేదీన రాత్రి 9:30 గంటలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.