అయితే ఈ సినిమాలో రజనీకాంత్ కు వెయ్యి రూపాయలు, కమల్ హాసన్ కు 1,500 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. అంతులేని కథ సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. అలా ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ ఇక ఆతర్వాత అటు తమిళ భాషతో పాటు తెలుగు భాషలో కూడా నటుడిగా ఉన్నతస్థాయికి ఎదిగి, సూపర్ స్టార్ అయ్యాడు.
ఇక ఈ మధ్య కాలంలో తెలుగులో రోబో, రోబో 2.0 సినిమాలు సక్సెస్ తర్వాత అంతగా హిట్స్ లేని రజనీకాంత్ అన్నాత్తే మూవీ దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని భావిస్తున్నారు. ముందు రాజకీయాల్లోకి వస్తానని చెప్పి, ఆతర్వాత ఇక రాజకీయా లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. విజృంభిస్తున్న కరోనా వైరస్ కూడా రజనీకాంత్ రాజకీయాలకు అడ్డంకిగా మారిందని అంటున్నారు.
అంతేకాక.. దక్షిణాదినే కాకుండా ఇతర దేశాల్లో కూడా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్ 70ఏళ్ళ వయస్సులో కూడా రజనీకాంత్ నటనకు దూరం కాలేదు. మొదటి సినిమాతోనే తెలుగువారికి పరిచయం అయిన రజనీకాంత్ వరుసగా తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేస్తూ, రావడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు కూడా ప్రకటించింది.