2021 ఏడాది ప్రారంభంలో విడుదలైన టాలీవుడ్ ఫిలిమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే క్రాక్, నాంది, ఉప్పెన, వకీల్ సాబ్, జాతి రత్నాలు వంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో మిగతా ఫిలిం ఇండస్ట్రీ లతో పోల్చుకుంటే మన టాలీవుడ్ లోనే థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా నడిచిందని తెలుస్తోంది. ఈ ఏడాది వేసవి కాలంలో పలు భారీ సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16వ తేదీన విడుదల కావలసి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా వాయిదా పడింది. నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. దీంతో భారీ సినిమాల విడుదల తేదీలు వాయిదా పడుతుండటంతో థియేట్రికల్ బిజినెస్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గత ఏడాది థియేటర్లు నడవక యజమానులు బాగా నష్టపోయారు. కానీ ఈ ఏడాది మంచి హిట్ సినిమాలతో థియేట్రికల్ బిజినెస్ బ్రహ్మాండంగా ప్రారంభమయ్యింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా మళ్ళీ థియేటర్ల బిజినెస్ పై నెగిటివ్ ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ థియేట్రికల్ బిజినెస్ కి కొండంత అండగా చిన్న సినిమాలు నిలుస్తున్నాయి.

ఈ నెలలో జాంబి రెడ్డి ఫేమ్ హీరోగా నటించిన "ఇష్క్: నాట్ ఎ లవ్ స్టోరీ" ఏప్రిల్ 23 వ తేదీన విడుదల కానుండగా..  ఏక్ మినీ కథ సినిమా ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు అయినా పాజిటివ్ టాక్ పొందితే సినిమా థియేటర్ల వ్యాపారానికి అంతగా నష్టం వాటిల్లదు. మరి చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయగలవా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: