సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ "సర్కారు వారి పాట" సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ ను దుబాయ్ లో చిత్రీకరించారు. అక్కడ ఎడారిలో ఫైట్ సీన్లను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ తరవాత మహేష్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కోసం కథను కూడా రెడీ చేశారట . ఆ కథను ఇప్పుడు సాన బెడుతున్నట్టు తెలుస్తోంది . అయితే త్రివిక్రమ్ సినిమాలన్నీ ఇప్పుడు హాసిని హారిక బ్యానర్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . కాగా ఈ సినిమా కూడా అదే బ్యానర్ లో తెరకెక్కబోతుందట . కాకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు కూడా భాగం అవ్వబోతున్నారని సమాచారం . 

అంతే కాకుండా మహేష్సినిమా కోసం సగం రెమ్యునేషన్ మాత్రమే తీసుకుంటారట . అంటే మిగతాది నిర్మాణంలో పెట్టుబడిగా చూసుకుంటారని టాక్. ఇదిలా ఉండగా మే 31న ఈ సినిమాకు క్లాప్ కొట్టబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అవ్వడం తో అదే రోజు సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నారట . ఇక ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో అతడు సినిమా సూపర్ హిట్ కాగా ఖలేజా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. కానీ టీవీ లో టెలికాస్ట్ అయిన తరవాత మాత్రం ఖలేజా ప్రేక్షకులను అలరించింది . మరి త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ఎలా ఉంటుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: