అయితే హఠాత్తుగా త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా బదులు కొరటాలకు ఎన్టీఆర్ తో ఛాన్స్ రావటం ఒకరకంగా మరొక దర్శకుడికి కలిసి వచ్చిందని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు వకీల్ సబ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వేణు శ్రీరామ్. గతంలో అల్లు అర్జున్ కి ఐకాన్ అనే మూవీ స్టోరీ చెప్పిన వేణు శ్రీరాం ఆ మూవీ తెరకెక్కించటానికి ఎన్నాళ్లనుండో ఎదురుచూపులు చూస్తున్నారు. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా అతి త్వరలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ దాని అనంతరం కొరటాలతో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తో కొరటాల సినిమా కన్ఫమ్ అవడంతో అల్లు అర్జున్ మూవీ కొన్నాళ్లు వాయిదా పడింది. దానితో దిల్ రాజు ఐకాన్ సినిమా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో ఐకాన్ సినిమా యొక్క పూర్తి స్క్రిప్ట్ ని వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కి వినిపించనున్నారని రాబోయే మరికొద్ది రోజుల్లో ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రారంభానికి సంబందించిన ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మొత్తంగా కొరటాల శివ ఒకింత పరోక్షంగా వేణు శ్రీరామ్ కి ఐకాన్ మూవీ ద్వారా హెల్ప్ చేశారనే న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.....!!