పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరోగా ఎదిగాడు.. గీత గోవిందం తో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యి వరస సినిమా లతో దుమ్మురేపుతున్నడు .. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాని బాలీవుడ్ టాప్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తుండటం విశేషం.. ఛార్మి  తో కలిసి పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు..

సినిమా తర్వాత రాబోయే రెండు సినిమాలను  కూడా లైన్ లో పెట్టాడు విజయ్ దేవరకొండ.. అందులో ఒకటి శివ నిర్వాణ దర్శకత్వంలో నిది కాగా, మరొకటి సుకుమార్ దర్శకత్వంలో నిది.. శివ నిర్వాణ ప్రస్తుతం నా ని టక్ జగదీష్ సినిమాతో బిజీగా ఉన్నాడు.. అతి త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో కలుస్తాడు శివ నిర్వాణ.. ఈ సినిమాను దిల్ రాజు తెరకెక్కిస్తుడడం  విశేషం.. ఇక సుకుమార్  పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నాడు సుకుమార్.. ఈ విషయాన్ని పోయిన సంవత్సరమే అధికారికంగా ప్రకటించారు..

 కాగా ఇటీవలే సుకుమార్ తన మనసు మార్చుకున్నాడని, విజయ్ దేవరకొండ తో కాకుండా రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు షికార్లు చేశాయి.. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొంత అయోమయంలో పడగా, తాజాగా సుకుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.. కానీ నెక్స్ట్ చేయబోయేది విజయ్ దేవరకొండ సినిమానే అని, రామ్ చరణ్ తో చేసే ఆలోచన ఉందా ఇప్పట్లో అది లేదు అని క్లియర్ గా చెప్పేశాడట.. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.. ఏదేమైనా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేస్తుండడం ఎంతో గర్వకారణం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: