పాకిస్తానీ ర్యాపర్, కమెడియన్ మహమ్మద్ షా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆలియా భట్ గురించి ర్యాప్ చేస్తూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి మహమ్మద్ షా ప్రయత్నించారు. అయితే బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నిజంగానే ఇంప్రెస్స్ అయ్యి ఈ వీడియో పై స్పందించారు. బహుత్ హార్డ్ అనగా చాలా బాగుంది అని ఆమె ఈ వీడియో పై ఒక కామెంట్ చేశారు. దీంతో మహమ్మద్ షా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

రణవీర్ సింగ్ ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన గల్లీ బాయ్ సినిమా ఒక ర్యాపర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. అందుకే ఎన్నో రాప్ సాంగ్స్ తో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలోని పాటలు భారతదేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందాయి. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ర్యాపర్ గా నటించిన రణవీర్ సింగ్ పై ఆయన పొగడ్తల జల్లు కురిపించారు. అయితే అందరి ప్రశంసలు పొందడమే కాదు సినిమా విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా 13 ఫిలింఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది. అయితే ఈ సినిమాలో బహుత్ హార్డ్ అనే ఒక స్లాంగ్ వర్డ్ బాగా పాపులారిటీ పొందింది.



అయితే మహమ్మద్ షా ఈ సినిమా చూసిన తరువాత ఇందులోని హీరోయిన్ ఆలియాభట్ పై ర్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాలోని స్లాంగ్ తోనే అతడి ప్రయత్నాన్ని ప్రశంసించారు.

ఇకపోతే ప్రస్తుతం మహారాష్ట్రలో షూటింగ్స్ నిలిపి వేయడంతోపాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా వాయిదా వేయడంతో ఆలియా భట్ తన కాబోయే భర్త రణబీర్ కపూర్ తో కలిసి మాల్దీవ్స్ వెళ్లి తన ఖాళీ సమయాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది కానీ ఇటీవలే కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: