దానితో హీరో గా అల్లు అర్జున్ క్రేజ్, మార్కెట్ మరింతగా పెరిగింది అని చెప్పక తప్పదు. ఇక ప్రస్తుతం లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గంధపు చెక్కల అక్రమ రవాణా నేపద్యంలో మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ క్లీనర్ పాత్ర చేస్తుండగా రష్మిక మందన్న ఒక గిరిజన యువతిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ దక్కించుకుంది.
అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర చేస్తున్న మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ తన యాక్షన్ తో అందరినీ ఆకట్టుకుంటారని అంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇంతకు ముందెన్నడూ చూడనంత క్రూరంగా ఆయన పాత్ర ఈ సినిమాలో ఉంటుందని ఒక బడా స్మగ్లర్ గా అలానే డాన్ గా రెండు రకాల విభిన్న షేడ్స్ లో ఆయన పాత్ర కొనసాగుతుందని చెబుతున్నారు .అలానే ఈ సినిమాని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ కూడా ఎంతో అలరించేలా దర్శకుడు కుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని టాక్. మొత్తంగా దీన్ని బట్టి చూస్తుంటే రేపు రిలీజ్ తర్వాత పుష్ప సూపర్ హిట్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్లి అల్లు అర్జున్ ఖాతాలో మరో సక్సెస్ ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.....!!