పవన్ జానీ సినిమా తర్వాత సత్యాగ్రహి మూవీ తీయాలని అనుకున్నారు. ఎంఎం రత్నం ప్రొడ్యూసర్ గా సెట్స్ మీదికి వెళ్లకుండానే ఈ సినిమా ఆగిపోయింది. జీసస్ క్రైస్ట్ పేరిట పవన్ తో ఓ మూవీ చేయాలని సింగీతం శ్రీనివాసరావు తీయాలని భావించి ప్రకటన కూడా చేశారు. ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లారెన్స్ తో ఆసినిమా చేయాలన్న టాక్ వచ్చినా సెట్స్ మీదికి వెళ్ళలేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో కోబలి మూవీ పవన్ తో చేయాలనీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకున్నా ఎందుకో ఆగింది. అయితే ఆ కథనే అప్ డేట్ చేసి,జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత గా చేసారు.
ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని పవన్ ని అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ లో మహేష్ బాబు నటించాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా పవన్ తో ఓ మూవీ చేయాలనుకున్నా సెట్స్ మీదికి రాలేదు. సంపత్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ 2ప్రకటన చేసినా ఎందుకో ఈ మూవీ ముందుకు వెళ్ళలేదు.
అలాగే కాటంరాయుడు కన్నా ముందే ఎస్ జె సూర్యతో ఓ సినిమా స్టార్ట్ చేశారు. కానీ ముందుకు వెళ్ళలేదు. వేదాళం మూవీ రీమేక్ పవన్ తో అనుకున్నా ఆగిపోయి. అదే మూవీ ఇపుడు చిరంజీవితో స్టార్ట్ చేస్తున్నారు. ఖుషి 2ప్రకటన వచ్చినా ఎందుకో ఆగిపోయింది. పోకిరి, అతడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి మూవీస్ కూడా పవన్ తో తీయాల్సినవే మిస్ అయ్యాయి.