ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం మళ్లీ సినిమా ఇండస్ట్రీ పై పడిందని చెప్పవచ్చు.. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకోకుండా OTT లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు..ఇప్పటికే పలు సినిమాలు OTT లో రిలీజ్ చేయడానికి డేట్స్ కూడా ప్రకటించగా మరి కొన్ని పెద్ద సినిమాలు ఈ లిస్టులో చేరుతాయని తెలుస్తుంది.. కోట్ల కోట్లు పెట్టిన సినిమా ద్వారా తీవ్ర నష్టాలు చవి చూడ కుండా ఉండాలంటే నిర్మాతలను గట్టెక్కించడానికి ఈ పద్ధతి తప్పదు అని అనుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం OTT లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

 చిన్న పెద్ద అనే తేడా లేకుండా వేరువేరు OTT లలో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని చిన్న సినిమాలు పెద్ద సినిమాలు... మోహన్ గోవింద్ డైరెక్షన్లో అశ్విన్ కాకుమను ముఖ్య పాత్రలో నటించిన ' పిజ్జా మీ మమ్మీ',  అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే OTT లలోనే  రిలీజ్ చేస్తున్నారు.. వకీల్ సాబ్ చిత్రం కూడా రిలీజ్ అయిన 21 రోజులకే అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 30 నుంచి స్విమ్మింగ్ అవుతుంది... పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అంజలి అనన్య కీలక పాత్ర పోషించారు..

ఇక నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్ గా నటించిన రంగ్ దే సినిమా కూడా త్వరలోనే జీ5 లో రానున్నట్లు తెలుస్తుంది.. అనసూయ ప్రధాన పాత్ర తెరకెక్కిన థాంక్యూ బ్రదర్, కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ ధనుష్ హీరోగా తెరకెక్కిన సూపర్హిట్ చిత్రం కర్ణన్, జగమే తంత్రం సినిమాలు ఓటిటిలలోనే అలరించబోతున్నాయి.. ఏదేమైనా ఇది ఓటిటి లకు మంచి పరిణామమే అయినా నిర్మాతలకు ఏ మాత్రం ఇలా రిలీజ్ చేసి డబ్బు సంపాదించడం ఇష్టం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: