రోజు రోజుకు సైబ‌ర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు అమాయ‌కుల‌ను టార్గెట్ చేసి ఏదో ఒక రూపంలో డ‌బ్బులు గుంజే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దొంగ‌కు ప‌ది తొవ్వ‌లు అన్న‌ట్టు ఒక దారిలో వీలుకాక‌పోతే మ‌రో దారిలో డ‌బ్బులు దోచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక గ‌త కొద్ది రోజులుగా సైబ‌ర్ నేర‌గాళ్లు ...పోలీసులు,సెల‌బ్రెటీలు ప్ర‌ముఖుల పేర్ల‌ను వాడుకుని డ‌బ్బులు గుంజే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌ముఖుల పేర్ల‌తో సోష‌ల్ మీడియా ఖాతాలు తెరిచి ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ల‌తో డ‌బ్బులు అవ‌స‌రం ఉన్నాయ‌ని...డ‌బ్బులు కావాల‌ని కోరుతున్నారు. అయితే తాజాగా సుప్రిమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ను కూడా కేటుగాళ్లు అదే తీరుగా వాడుకున్నారు. ఓ సైబ‌ర్ నేర‌గాడు సాయి ధ‌ర‌మ్ తేజ్ పేరు అతడి కో యాక్ట‌ర్ ద‌గ్గ‌ర డబ్బులు గుంజే ప్ర‌య‌త్నం చేసాడు. తాను సాయి ధ‌ర‌మ్ తేజ్ ను అని త‌న‌కు రూ.15 వేలు అవ‌స‌రం ఉంద‌ని త్వ‌ర‌గా పంపాల‌ని కోరాడ‌ట. 

దాంతో అనుమానం వ‌చ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్ కో యాక్ట‌ర్ అత‌డి దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకువెళ్లారు. అంతే కాకుండా డ‌బ్బులు అడుగుతూ చేసిన చాటింగ్ ను సాయిధ‌రమ్ తేజ్ కు పంపించారు. దాంతో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆ స్క్రీన్ షాట్ ల‌ను త‌న సోష‌ల్ మీడియాలో అప్లోడ్ చేసారు. అంతే కాకుండా జాగ్ర‌త్తగా ఉండాల‌ని..త‌న పేరు మీద అలాంటి మెసేజ్ లు వ‌స్తే రిప్లై ఇవ్వ‌ద్ద‌ని తెలిపారు. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ సీరియ‌స్ గా పెట్టిన ఈ పోస్ట్ కు నెటిజ‌న్లు మాత్రం ఫ‌న్నీగా రిప్లైలు ఇస్తున్నారు. అంత పెద్ద హీరోను 15 వేలు అడ‌గ‌టం ఏంట్రా బాబు...అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండ‌గా సాయి ధ‌రమ్ తేజ్ ప్ర‌స్తుతం రిప‌బ్లిక్ అనే సినిమా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ప్ర‌స్తానం లాంటి సూప‌ర్ హిట్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దేవ‌క‌ట్ట తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పోస్టర్లు, ఫ‌స్ట్ గ్లింప్స్ తో సినిమాపై మరిన్ని అంచ‌నాలు పెరిగాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: