అవికా గోర్ గురించి తెలియని వారంటూ ఉండరు. బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‏గానూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాలో అవికా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమ తర్వాత అవికా.. తెలుగులో వరుసగా.. సినిమా చూపిస్తా మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత అవికాకు తెలుగులో అంతగా ఆఫర్లు రాలేదు.

తాజాగా సమాచారం ప్రకారం... అవికా గోర్ జర్నలిస్ట్‏గా మారనుందట. ఈ విషయాన్ని తన సన్నిహితులే చెప్పెస్తున్నారు. దీంతో అవికా అభిమానులు మొదట్లో ఆశ్చర్యపోయినా.. తర్వాత రియల్ లైఫ్ లోనా లేదా రీల్ లైఫ్ లోనా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అందరికి షాక్ ఇస్తూ అసలు విషయాన్ని చెప్పెశారు సినీ వర్గాలు.. ఈ అమ్మడు జర్నలిస్ట్‌గా నిజంగా మారడంలేదు.. కేవలం సినిమా కోసం మాత్రమే జర్నలిస్ట్ గా మారబోతుందట.

అయితే ఇంతకీ అసలు మ్యాటరేంటంటే… అవికాగోర్‌ ప్రస్తుతం ఆదిసాయికుమార్‌తో సజ్జా వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌1’లో జర్నోగా నటిస్తోంది. అవును బల్‌వీర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఓ కేసుని శోధించే జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌లో కనిపించనుంది. అలా ఆ కేసును శోదిస్తున్న క్రమంలో ఆమెకు ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే.. ఇటీవలే అవికా.. కరోనా సెకండ్ వేవ్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. అవికా కుటుంబ సభ్యులు కూడా కరోనా భారిన పడ్డారు. ప్రస్తుతం వారందరూ కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక అవికా సోషల్ మీడియా వేదికగా కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: