సినిమా అంటేనే అన్ని సమపాళ్లలో ఉంటేనే అది సినిమా అవుతుంది. అప్పుడే ఆ సినిమా చూడడానికి కళ్ళకి ఇంపుగా ఉంటుంది. సినిమాలో హీరో క్యారెక్టర్ కధకి ఎంత బలాన్ని చేకురుస్తుందో ప్రతి నాయకుడు పాత్ర కూడా అంతే బలాన్ని ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే సినిమాలలో హీరో కి ఎంత క్రేజ్ ఉంటుందో ఆ హీరోతో తలబడే విలన్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పటిదాకా మాములుగా మనం సినిమాల్లో విలన్ పాత్రల్లో మేల్ విలన్స్ నే చూసి ఉంటాము. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ లో ఆడవాళ్లు ఎక్కువగా నటిస్తున్నారు.హీరోకి దీటుగా ఎదురుపడి విలన్ పాత్రలో లేడి విలన్ నటిస్తే ఆ సినిమాల్లో వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక ఇప్పటికే అలనాటి సినిమాలలో సీనియర్ నటీమణులు రమ్యకృష్ణ, రాశి విలన్ పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ బాటలోనే మన యంగ్ స్టార్ హీరోయిన్స్ కూడా అడుగులు వేస్తున్నారు. మరి విలన్ రోల్ లో మనల్ని మెప్పించడానికి సిద్ధం అవుతున్న ఆ యంగ్ హీరోయిన్స్ ఎవరో ఒక లుక్ వేద్దామా.. !


 మిల్క్ బ్యూటీ తమన్నా గురించి మన అందరికి తెలిసినదే. ఒకప్పటి స్టార్ హీరోయిన్. కానీ ఈ మధ్య సినిమాలలో అవకాశాలు తగ్గడంతో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు సైతం చేయడానికి సిద్ధం అయిపొయింది ఈ మిల్కీ భామ. ప్రస్తుతం ఆమె నితిన్ తో కలిసి ‘మ్యాస్ట్రో‘ సినిమాలో నటిస్తుంది.ఇక ఈ సినిమా బాలీవుడ్ ‘అంధాధున్’ రీమేక్ అవ్వగా ఇందులో టబు చేసిన ప్రతినాయిక పాత్ర తమన్నా చేయనున్నట్లు సమాచారం. అలాగే మన టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్  వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో ‘సాని కాయిధం’ అనే సినిమాలో నటించనుందట.


ఇక ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుండగా.ఇందులో కీర్తి సురేష్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే మన  ఆర్ఎక్స్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా ఇదే కోవలోకి వస్తుందని చెప్పాలి. ఇటీవలే విడుదలయిన అనగనగా ఓ అతిథి సిరీస్ లో నటించగా ఇందులో తన పాత్ర విలన్ పాత్రగా ఉండనుందట. ప్రస్తుతం ఆమె మరో ‘త్రీ రోజస్‘ వెబ్ సిరీస్ లో కూడా ప్రతినాయక పాత్రలో నటిస్తుంది. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉండగా.అందులో ‘ది ఫ్యామిలీ మెన్ 2‘ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇందులో నెగటివ్ షేడ్ పాత్రలో నటిస్తుంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: