అల్లరి నరేష్ హీరోగా దేవి ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రం కెవ్వు కేక. ఈ చిత్రం 2013 జూలై 19న విడుదలయింది. ఇక ఈ చిత్రాన్ని బోపన్న చంద్రశేఖర్ నిర్మించారు. ఇక ఈ చిత్రం విడుదలై దాదాపు 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, తిరిగి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చలపతిరావు ఒక సన్నివేశంలో బండబూతులు తిడుతూ ఉండే ఒక సన్నివేశం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కెవ్వు కేక సినిమాలో అల్లరి నరేష్ ను తిట్టే సన్నివేశం ను స్లో మోషన్ లో చూస్తే కానీ అర్థం అవ్వలేదట. యూట్యూబ్ లో కెవ్వు కేక సినిమా ను 34:18 నిడివి దగ్గర 0.25× స్పీడ్ తో వింటే ఆ బూతులు గోల ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. ఈ సీను ఫాస్ట్ మోడ్ లో చేయడంతో అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఈ విషయంలో సెన్సార్ బోర్డు కూడా మోసం చేశారు అని కూడా చెప్పుకోవచ్చు.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సోషల్ మీడియాలో చలపతిరావుకు సంబంధించిన బూతుల సీన్ వైరల్ అవడంతో, ఆ విషయంపై దర్శకుడు దేవి ప్రసాద్ స్పందించక తప్పలేదు. ఈ వీడియో రాత్రి నా దృష్టికి వచ్చిందండి. అలాంటి ఘోరమైన సన్నివేశం ఎలా జరిగిందో అప్పటికీ అర్థం కాలేదు. షూటింగ్ లో అయితే ఆయన బాగానే చెప్పారు. దాన్ని డబ్బింగ్ కు మాత్రం నేను వెళ్లలేదు. ఆ సన్నివేశాన్ని ఫాస్ట్ చేసి, ఎడిటింగ్ కు వచ్చిన డైలాగు మాత్రమే తెలుసు.. అంటూ దేవి ప్రసాద్ సోషల్ మీడియాలో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ఇక ఈ పాస్ట్ వీడియో సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది . అయితే ఈ సినిమా ఓ టీ టీ లో వస్తోన్న మీర్జాపూర్ మున్నాభాయ్ సినిమా కంటే దారుణంగా ఈ వీడియోలో బూతులు ఉన్నాయని ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ అంటున్నారు.