విజయ్ తన తండ్రిని చూసి నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అలా విజయ్ తన సినిమా జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధం అయ్యాడు. అయినా కానీ మొదటి సినిమాతోనే ఫేమస్ గా మారడానికి ఇతను మెగాస్టార్ ఫ్యామిలీకి చెందినవాడు కాదు, అలాగని పెద్ద సెలబ్రిటీ కాదు. అందరిలాగే ఒక సాధారణ నటుడు. విజయ్ తన అంకిత భావంతో తనకు వచ్చిన అవకాశాన్ని మరియు సినిమాలోని పాత్రను చక్కగా చేసుకుంటూ వచ్చేవాడు. ఫలితం మాత్రం ప్రజలకే వదిలేశాడు. విజయ్ తన సినిమా జీవితాన్ని రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన నువ్విలా మరియు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలతో ప్రారంభించాడు. అయినా ఈ సినిమాలు తనకు మంచి పేరును తీసుకు రాలేకపోయాయి. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా "ఎవడే సుబ్రహ్మణ్యం" లో నానితో కలిసి నటించాడు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు.
విజయ్ తన కెరీర్ ని సినిమా రంగంగా ఎంచుకున్నాడు కాబట్టి వెనకడుగు వేయకుండా ముందుకు సాగాడు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు సినిమాతో విజయ్ కి మంచి పేరొచ్చింది. ఇందులో తన నటన డైలాగ్స్ అన్నీ బాగా కుదిరాయి. ఇక అప్పటినుండి విజయ్ కెరీర్ మంచి స్పీడ్ తో దూసుకుపోయింది. ఇప్పుడు ది మోస్ట్ వాంటెడ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా విజయ్ చేసిన అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రత్యేకంగా యువతలో చెప్పలేని ఫాలోయింగ్ ఏర్పడింది. అలా తన తండ్రి ప్రభావం మేరకు సినిమా జీవితంలో వచ్చాడు. ఈ రోజు విజయ్ తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు.