ఇటీవల కాలంలో ముఖ్యంగా మా టీవీలో ప్రసారమవుతున్న ధారావాహికల మధ్య  గట్టి పోటీ మొదలైన విషయం అందరికీ తెలిసిందే. బుల్లితెరపై  ప్రసారమయ్యే ధారావాహికలన్ని ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం అయితే చాలు ఆడవాళ్ళు ఈ ధారావాహికల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అంటే అంతలా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కార్తీక దీపం, వదినమ్మ, ఇంటింటి గృహలక్ష్మీ, గుప్పెడంత మనసు, దేవత, జానకి కలగనలేదు లాంటి ధారావాహికలు ప్రేక్షకులకు బాగా వినోదాన్ని పంచుతున్నాయి. అయితే ఈ వారం  టీఆర్పీ రేటింగ్ ప్రకారం ఏ సీరియల్ ముందంజలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


1. కార్తీకదీపం:
ఎప్పటిలాగే ఈసారి కూడా కార్తీకదీపం మంచి టీఆర్పీ రేటింగ్ ను సాధించింది. మలయాళ డైలీ సీరియల్ కరుతముత్తు సీరియల్ ఆధారంగా తెరకెక్కుతున్న కార్తీక దీపంలో కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమీ విశ్వనాథ్ , మోనితగా శోభితా శెట్టి, సౌందర్యగా అర్చన తదితరులు నటిస్తున్నారు. దీప అనారోగ్యం అనే అంశం ఈ సీరియల్ కి హైప్ గా నిలిచింది. దీప, కార్తీక్ ల మధ్య వాగ్వాదం, మోనిత కుట్రలు , సౌందర్య ఎమోషనల్ అంశాలు సీరియల్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లడమే కాకుండా టాప్ రేంజ్‌కు కూడా చేర్చాయి.


2. ఇంటింటి గృహలక్ష్మి :
బుల్లితెరపై గట్టి పోటీ  మధ్య నిలదొక్కుకుంటూ, మిగతా సీరియల్స్ కి కూడా గట్టిపోటీని ఇచ్చి, రెండవ స్థానాన్ని చేజిక్కించుకుంది ఇంటింటి గృహలక్ష్మి. అత్యంత టీఆర్పీ రేటింగ్ సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇందులో నటి అలాగే లాయర్ అయిన కస్తూరి శంకర్, హరికృష్ణ లు , ఈ సీరియల్ కు హైలెట్ గా నిలుస్తారు.


3. గుప్పెడంత మనసు:
 బుల్లితెర పై ప్రసారమవుతున్న సీరియల్స్ లో టీఆర్పీ రేటింగ్ ను బాగా సాధించి , మూడవ స్థానాన్ని చేజిక్కించుకుంది గుప్పెడంత మనసు సీరియల్. ఇందులో సాయికిరణ్ రామ్, ముఖేష్ గౌడ తదితరులు నటిస్తూ అటు సెంటిమెంటల్ గా, ఇటు ఎమోషనల్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

4. జానకి కలగనలేదు:
మొదట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సీరియల్ ఇక టీఆర్పీ రేటింగ్ లో మాత్రం నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ప్రియాంక జైన్, అమర్‌దీప్, సినీ నటి రాశి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సీరియల్ కూడా ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది..

5. దేవత:
ఇప్పటి వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సీరియల్ దేవత. అయితే మధ్యలో ఏమైందో తెలియదు కానీ ఈ వారం టీఆర్పీ రేటింగ్ బాగా పడిపోయింది. చివరకు  5వ స్థానానికి చేరుకుంది.. ఇందులో సుహాసిని, అర్జున్ అంబటి, వైష్ణవి లీడ్ రోల్స్‌లో నటించి , ఈ సినిమాకు హైలెట్ గా నిలిచారు. అయితే  గతవారం టీఆర్పీ రేటింగ్‌లో దేవత సీరియల్ నాలుగోస్థానంలో ఉండేది. గతంలో దేవత సీరియల్ మూడో స్థానానికి కూడా చేరుకొన్న సందర్భాలు ఉన్నాయి. ఇక దేవత సీరియల్‌కు గుప్పెడంత మనసు సీరియల్ నుంచి గట్టిపోటీ ఎదురవుతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: