ప్రధాన పాత్రలో పోషించిన సాయి చరణ్ తేజ్ పుట్టినరోజు మే 9న సందర్భంగా మైకెల్ సినిమా పోస్టర్ ను విడుదల చేయగా.. తాజాగా నేడు రంజాన్ పండుగ పర్వదినాన సందర్భంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ట్రైలర్ విడుదల నేపథ్యంలో సినిమా నిర్మాత పార్థు రెడ్డి మాట్లాడుతూ.. తాను సినిమాను చూశానని, చాలా బాగా వచ్చిందని తెలియజేశారు. నిజానికి దర్శకుడు కిరణ్ స్టోరీ చెప్పిన దానికంటే చాలా బాగా తెరకెక్కించాడని ఆయన తెలిపారు. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవారే నటించినప్పటికీ.. నటీనటులు అందరూ ఎంతో అనుభవం ఉన్న వారిలా నటించారని తెలియజేశాడు. సినిమాను అతి త్వరలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన తెలియజేశారు. చూడాలి మరి ఈ కొత్త నటీనటులు ప్రేక్షకులను ఎంతవరకు ఇప్పించగలరో.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ ను వీక్షించండి.