సక్సెస్ అనేది లేకపోతే ఎక్కడైనా నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ సక్సెస్ ను తొందరగా సాధించాలంటే మాత్రం అది ఊరికే రాదు. అలా సక్సెస్ కావడానికి చాలా హార్డ్ వర్క్ తో పాటు టైమ్ కూడా కలిసి రావాలి. ఇలా జీవితంలో సక్సెస్ సాధించాలంటే చాలావరకు అవమానాలు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. సినిమా లలో హీరో పాత్రలు చాలా డబ్బున్న వారిలానో లేదా మిడిల్ క్లాస్ అబ్బాయిలా చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం సక్సెస్ లేక చేతిలో రూపాయి లేక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పాత్రల్లో కనిపించారు. అలాంటి పాత్రల్లో నటించిన వారు ఎవరేవరో చూద్దాం.
1). పవన్ కళ్యాణ్ - తమ్ముడు :
తమ్ముడు చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. చివరికి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచి, అవమానించిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకుంటాడు.
2). రవి కృష్ణ - 7/G బృందావన్ కాలనీ :
ఈ చిత్రంలో హీరో ఉద్యోగాలు లేక తన తండ్రి చేతిలో తన్నులు తింటుంటాడు. తాను ఉద్యోగం సంపాదించి సక్సెస్ అయ్యే వరకు ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటాడు.
3). వెంకటేష్-ఆడవారి మాటలకు అర్థాలే వేరులే:
ఈ సినిమాలో హీరో వెంకటేష్ ఉద్యోగం సాధించలేక చాలా ఇబ్బందులు పడుతుంటాడు. అతని తండ్రి గ్యాప్ లేకుండా అతన్ని తిడుతుంటారు. ఈ పాత్రలో వెంకీ జీవించాడనే చెప్పాలి.
4). నితిన్ - సంబరం:
ఈ చిత్రంలో నితిన్ ఖాళీగా తిరిగే కుర్రాడు గా కనిపిస్తూ ఉంటాడు. ఎన్నో అవమానాలు భరిస్తూ చివరికి ఉద్యోగం సంపాదించి, వాటికి పులిస్టాప్ పెడతాడు.
5). సుమంత్ - సత్యం:
ఈ సినిమాలో హీరో సుమంత్ మంచి టాలెంట్ కలిగి ఉండి , ఎన్నో మంచి పనులు చేస్తూ కూడా ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తూ ఉంటాడు.
6). విజయ్ దేవరకొండ - పెళ్లి చూపులు:
ఈ సినిమాలో హీరో పాత్రకు ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడు బాగా కనెక్ట్ అవుతారు అనడంలో ఏలాంటి సందేహం లేదు. చివరి వరకు ఇతను తన తండ్రితో మాటలు పడుతూనే ఉంటాడు.
7). రఘువరన్ బీటెక్ - ధనుష్:
ఈ సినిమాలో బిటెక్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండే కుర్రాడి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు. ఉద్యోగం లేక తన తండ్రి తో మాటలు పడే కుర్రాడిగా ధనుష్ కనిపిస్తాడు.
8). నాని - జెర్సీ:
ఎటువంటి సంపాదన లేకుండా తన భార్యతో మాటలు పడే భర్త పాత్రలో నాని బాగా నటించాడని చెప్పవచ్చు.
9). సాయి ధరమ్ తేజ్ - చిత్రలహరి:
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ చాలా ఎమోషనల్ గా నటించి, మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేక అవమానాలు ఫేస్ చేసే కుర్రాడిగా సాయి ధరమ్ తేజ్ చిత్రం లో కనిపించాడు.
10). సూర్య - ఆకాశమే నీ హద్దురా:
ఈ చిత్రంలో హీరో సూర్య ఎయిర్ లైన్ సర్వీస్ ను ప్రారంభించి, తన ఊరికి మంచి పేరు తేవాలని పరితపిస్తూ ఉంటాడు. అందుకోసం ఎన్నో అవమానాలు భరిస్తూ చివరికి వాటిని అధిగమిస్తాడు.