స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ పరిశ్రమలో అపరకుబేరుడు అని చెప్పుకోవచ్చు. ఆయనకు అక్షరాల 350 కోట్ల రూపాయలు ఉన్నాయని సమాచారం. ఆయన సినిమాలు, బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ నుంచి ఒక్క నెలకు 3 కోట్ల రూపాయలు సంపాదిస్తారని అంచనా. సంవత్సరానికి రూ. 32 కోట్లు సంపాదిస్తారు అని తెలుస్తోంది. అతనికి
హైదరాబాద్ లో "800 జూబ్లీ" అనే ఒక నైట్ క్లబ్ కూడా ఉంది. పార్లే ఆగ్రో ఫ్రూటీ,
రెడ్ బస్, కోల్‌గేట్ మాక్స్ ఫ్రెష్, లాట్ మొబైల్ వంటి ఒక్కొక్క బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు ఆయన 2-3 కోట్ల రూపాయలు తీసుకుంటారని తెలుస్తోంది. ఆయన రెండున్నర కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ కారు కొన్నారు. ఆయనకు ఏడు కోట్లు విలువచేసే అత్యంత విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది. రెండు కోట్లు విలువ చేసే మరో 2 కార్లు ఉన్నాయని సమాచారం. ఆయన నివసించే ఇల్లు ఖరీదు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
అల్లు అరవింద్ టాలీవుడ్ చలనచిత్రరంగంలో ప్రముఖ
నిర్మాత అయినప్పటికీ ఆయన కుమారుడు
అల్లు అర్జున్ మాత్రం తన కృషితో, ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు. అలాగే భారతదేశ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన క్రేజ్ ఎంతలా పెరిగిపోయింది అంటే.. ప్రస్తుతం అతను తన సినిమాలకు రూ.30-50 కోట్ల రూపాయలు పారితోషికంగా పుచ్చుకుంటున్నారు.
ఇకపోతే అల్లుఅర్జున్ ప్రముఖ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. 100 కోట్లకు పైగా ఆయనకు ప్రముఖ కంపెనీలలో షేర్లు ఉన్నాయని సమాచారం.
బన్నీ హైదరాబాద్ లో పెద్ద మల్టీప్లెక్స్
థియేటర్ నిర్మిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ తో పాటు ఓటీటీ రంగంలో కూడా అరంగేట్రం చేశారు. అల్లు స్టూడియోస్ పేరిట 10 ఎకరాల్లో ఒక స్టూడియో నిర్మించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ విధంగా
టాలీవుడ్ సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో అల్లు వారి ఫ్యామిలీ కాలు మోపుతోంది.