టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రవితేజ హీరోగా తనకంటూ మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.. ప్రస్తుతం స్టార్ హీరోగా కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్న మాస్ మహారాజా.. తన కెరీర్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'నీ కోసం' సినిమాలో రవితేజ హీరోగా చేసాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చి ఇడియట్ సినిమాతో సెటిల్ అయ్యాడు తరువాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్,బలుపు,పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో మాస్ మహారాజా అనే బిరుదును కైవసం చేసుకున్నాడు.. ఇక ఇటీవలే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజకు సంబంధించి ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది..

గతంలో రవితేజ ఒక సినిమాకు 5-6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.కానీ ప్రస్తుతం మాత్రం ఈ హీరో ఒక్కో సినిమాకు 10కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం..ఇక రవితేజకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ఆస్తి అంచనా విలువ దాదాపు16 కోట్లకు పైమాటే.అంతేకాదు ఈ హీరోకి పలు లగ్జరి కార్లు కూడా ఉన్నాయి.లగ్జరీ కార్లను కలిగి ఉంది, ఇందులో రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎం 6 వంటి బ్రాండ్‌లు ఉన్నాయి.ఇక 2012 లో వార్షిక ఆదాయం15.5 కోట్లకు పైగా ఉన్న100 మంది ప్రముఖుల జాబితా ఫోర్బ్స్ లిస్ట్ లో 50 వ స్థానాన్ని దక్కించుకున్నాడు.. ఇక  2021 నాటికి రవితేజకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ 113 కోట్లు అని తేలింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: