బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతూ వస్తుంది.అలాగే జబర్దస్త్ షో కూడా ఎంతోమంది కమెడియన్స్ కు జీవితాన్ని ఇచ్చింది.అలా జబర్దస్త్ షో ద్వారా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కమెడియన్స్ లో జబర్దస్త్ ఆనంద్ కూడా ఒకరు అనే చెప్పాలి. అలానే ఆనంద్ ఎంతో కష్టపడి మరి పైకి వచ్చాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు.అలాగే ఆనంద్ తన స్కూల్ డేస్ నుంచే చిన్న తరహా స్కిట్స్ వేసుకుంటూ వచ్చాడు. జబర్దస్త్ కు వచ్చిన తరువాత కూడా ఆనంద్ కు అంత ఈజీగా ఛాన్సులు దక్కలేదు. చాలా రోజులు వేచి చూస్తేగాని అవకాశాలు రాలేదట.


చమ్మక్ చంద్రతో పాటు కలిసి స్కిట్ చేస్తూ ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యే వరకు వచ్చాడు. అంతేకాదు అతని సంపాదనతో ప్రత్యేకంగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు. అలాగే తనకంటూ  ఒక యూ ట్యూబ్ ఛానెల్ ను కూడా సెట్ చేసుకున్నాడు ఆనంద్.ఇక ఇటీవల తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేశాడు. అందులో ఆనంద్ భార్య పిల్లలను కూడా పరిచయం చేశాడ. ఆనంద్ భార్యను వీడియో ద్వారా మొదటిసారి అందరికి పరిచయం చేయడంతో నెటిజన్లు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఆనంద్ భార్య చాలా అందంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తనని చుసిన వారందరు మీ భార్య హీరోయిన్స్ కంటే తక్కువేమి కాదు. చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


అలాగే ఆనంద్ తన ఇద్దరు కొడుకులు కూడా పరిచయం చేయగా వారు కూడా చాలా క్యూట్ గా ఉన్నట్లు ఫాలోవర్స్ కామెంట్స్ కురిపించారు. ఆనంద్ తన భార్యని ప్రేమించి మరి పెళ్ళి చేసుకున్నాడు తెలుసా. వాళ్ళది ఫేస్ బుక్ పరిచయం. అలా ఆ పేస్ ఫేస్ బుక్ పరిచయం కాస్త పెరిగి ఆ తరువాత ఒకరినొకరిని ఇష్టపడినట్లు చెప్పాడు. అయితే అమ్మాయి తరపు వాళ్ళది అనంతపురం కావడంతో మొదట ఇంట్లో ఒప్పుకోలేదని, బాగా గొడవలు కూడా జరిగాయని  చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో చమ్మక్ చంద్ర అలాగే మేడం రోజాగారు కూడా ఎంతగానో సపోర్ట్ చేసినట్లు ఆనంద్ వివరణ ఇచ్చారు.












మరింత సమాచారం తెలుసుకోండి: