టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల అరవింద సమేత సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా కీరవాణి సంగీతాన్ని కే కే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. భారీ పాన్ ఇండియా సినిమాగా పేట్రియాటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు.

ఇక ఈ మూవీపై మన దేశంతో పాటు విదేశాల్లోని ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపుగా రు. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే మరొక మూడు రోజుల్లో అనగా ఈనెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ ఉండటంతో ఆయన అభిమానులు ఐదురోజుల ముందు నుండే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయనకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పేరుతో పలు ట్రెండ్స్ సెట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

అలానే ఎన్టీఆర్ బర్త్ డే ని పురస్కరించుకుని యూట్యూబ్ లో 3డి మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ఇక ఆయన బర్త్ డే రోజున ఆర్.ఆర్.ఆర్ లోని కొమరం భీం ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు తదుపరి ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కనున్న మూవీ యొక్క టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రానున్నట్లు సమాచారం. మరి మరొక మూడు రోజుల్లో రానున్న ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆయన అభిమానులు ఇంకెంత సందడి చేస్తారో చూడాలి..... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: