మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అవసరమయ్యే కథలను ,కథానాయికలను మన దర్శక నిర్మాతలు తమిళ చిత్ర పరిశ్రమ నుండి తెచ్చుకుంటున్నారు. ఇక ఇన్ని చేసిన మనవాళ్లు సేవ గుణాన్ని మాత్రం తెచ్చుకోవడం లేదేంటి ? ఏమో.. మన హీరోల పద్దతి చూస్తుంటే, అది తప్ప ఏదైనా చేస్తాం అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. ఎందుకంటే దేశంలో కరోనా పరిస్థితులు రోజురోజుకు చాలా అధ్వానంగా మారిపోతున్నాయి. ఆక్సిజన్ కొరత ఎంత ఉందో ప్రత్యేక గంగా చెప్పనవసరం లేదు.. అలాగే మనం వాడే ట్విట్టర్లు, మనం వాడే ఇన్స్టాగ్రామ్ లు, మనం వాడే సోషల్ మీడియా ఇవన్నీ కూడా మన హీరోలు, హీరోయిన్లు కూడా వాడుతున్నారు కదా ! వాళ్లకు కూడా కనిపిస్తాయి కదా.! అయితే పక్కనే వున్న తమిళ్ హీరోలు చేస్తున్న సహాయంలో పావల భాగం కూడా మనవాళ్లు చేయడం లేదు ఏంటి ? అసలు వాళ్ళు చేసే సహాయం మన వాళ్లకు తెలియడం లేదా ? తెలిసి కూడా మనకెందుకులే అని ఊరుకుంటున్నారా ? ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలు ప్రజలు అందరిలోనూ తలెత్తుతున్నాయి..
ముఖ్యంగా చెప్పాలంటే, ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రానికి స్టాలిన్ కొత్త సీఎంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది సినిమా స్టార్స్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వెళ్లి కేవలం సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపి రావడంలేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అదుపులో పెట్టడానికి, ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి డబ్బుల రూపంలో తమ వంతు సహాయాన్ని ప్రజల కోసం అందిస్తున్నారు తమిళనాడు స్టార్ హీరో లు.
అసలు విషయానికొస్తే , ఇటీవల శివకార్తికేయన్ సీఎం ఫండ్ నిధికి రూ. 25 లక్షలను విరాళంగా ఇచ్చాడు. అలాగే వెట్రిమారన్ రూ. 10 లక్షలు, జయం రవి, మోహన్ రాజు రూ.10 లక్షలు, దర్శకుడు శంకర్ రూ.10 లక్షలు, దర్శకుడు మురుగదాస్ రూ. 25 లక్షలు ,నటుడు అలాగే స్టాలిన్ తనయుడు ఉదయనిధి రూ.25 లక్షలు, స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ రూ. 1లక్ష, దర్శకుడు అమోద్ రూ 50,000 , సౌందర్య రజనీకాంత్ రూ.1కోటి, సన్ ప్రొడక్షన్స్ రూ.30 కోట్లు , అజిత్ రూ.25 లక్షలు , రజినీకాంత్ రూ. 50 లక్షలు ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు .
వారు ఇచ్చిన డబ్బులు పెద్ద మొత్తమా? చిన్న మొత్తమా? లేక సీఎం మెప్పు పొందడం కోసం ఇలా చేస్తున్నారా? అనే విషయాలను పక్కన పెడితే, ఎవరు అడగకుండానే వీరంతా స్వతహాగా సీఎం ఫండ్ కు ప్రజల కోసం డబ్బు రూపంలో సహాయం చేశారు.. కేవలం మన హీరోలు వీడియోలు, ఫోటోల , పోస్ట్ ల ద్వారా సేఫ్ గా ఉండండి, ప్లాస్మా దానం చేయండి .అంటూ స్టేటస్లు పెట్టడం తప్పా ఇంకేమీ చేయడం లేదు.. ఏదైనా సినిమా విడుదలైంది అంటే ప్రజలే మా దేవుళ్లు, మా అన్నదమ్ముల అని చెప్పుకు వచ్చే వీళ్ళు, ఇప్పుడు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు సహాయం చేయడం లేదు.. ఏది ఏమైనా సినిమాలలో కాకుండా ప్రజలకు మీకు తోచినంత సహాయం చేయడానికి ముందుకు రావాలని ప్రజలు వాపోతున్నారు..