నటి గోపిక తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది. అయితే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక గోపిక 2008లో ఎన్నారై డాక్టర్ అజిలేష్ చాకోను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అమీ, కుమారుడు ఐడెన్ ఉన్నారు. ప్రస్తుతం కుటుంబం తో కలిసి గోపిక ఆస్ట్రేలియా లో ఉంటుంది.
స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ లయ. ఆ తరవాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కాగా లయ 2006లో ఎన్నారై డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. లయ కుటుంబం తో కలిసి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటుంది.
టాలివుడ్ అందాల తారల్లో పరిచయం అక్కర్లేని పేరు రంభ. ఎన్నో సినిమాల్లో నటించిన రంభ 2010లో తిరుమల దేవస్థానంలో ఇంద్రన్ పద్మనాథన్ అనే ప్రముఖ వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
తెలుగు తో పాటు తమిళ, మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి మాధవి. దాదాపు 300 చిత్రాల్లో నటించిన మాధవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మాతృదేవోభవ అనే సినిమాతో టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకుంది. 1986లో జర్మనీకి చెందిన రాల్ఫ్ శర్మ అనే వ్యాపారిని వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉండగా ప్రస్తుతం వీరు న్యూజెర్సీలో ఉంటున్నారు.