సిద్ శ్రీరామ్ ప‌రిచయాలు అక్క‌ర్లేని పేరు. సాధార‌ణంగా సింగ‌ర్స్ కు అంత క్రేజ్ ఉండ‌దు. ఎస్పీ బాలు, యేసుదాసు..ఏఆర్ రెహ‌మాన్ ల‌కు ఎంతో మంది అభిమానులున్నారు కానీ అప్ క‌మింగ్ గాయ‌కుల‌కు మాత్రం ఫ్యాన్స్ ఉండ‌టం అరుదుగా క‌నిపిస్తుంది. సోనూ నిగ‌మ్ , కార్తీక్ లాంటి గాయ‌కుల‌కు మంచి క్రేజ్ ఉంది. వాళ్ల త‌ర‌వాత గొంతుతో మాయ చేసిన సింగర్ ఎవ‌రూ లేర‌నే చెప్పాలి. ఇలాంటి స‌మ‌యంలోనే నేనున్నా అంటూ సిద్ శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చారు. 31 ఏళ్ల సిద్ శ్రీరామ్ టాలీవుడ్ తో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ మోస్ట్ వాంటెడ్ సింగ‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ రోజు సిద్ శ్రీరామ్ పుట్టిన రోజును జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా సిద్ పాడిన సూప‌ర్ హిట్ పాట‌లు కొన్ని చూద్దాం.

సిద్ శ్రీరామ్ త‌న మొద‌టి పాట‌ను మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌డ‌లి సినిమా కోసం పాడారు. ఈ సినిమాలో "యాడికే" అనే ల‌వ్ సాంగ్ ను పాడి ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడు. అంతే కాకుండా మొద‌టి పాట‌తోనే సిద్ కు మంచి గుర్తింపు వ‌చ్చింది.

 

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన గీతాగోవిందం సినిమా ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సినిమా విజయంలో పాట‌లు కూడా ముఖ్య పాత్ర‌ను పోశించాయి. సినిమాలో "వ‌చ్చింద‌మ్మా వ‌చ్చింది." "ఇకేం ఇంకేం కావాలే...చాలే ఇది చాలే." అంటూ పాట‌లు పాడి సినిమా విజ‌యంలో సిద్ భాగ‌మ‌య్యారు.


అతిపెద్ద మ్యూజిక‌ల్ హిట్ అల వైకుంఠ‌పురం సినిమాలోనూ సిద్ త‌న గొంతుతో మాయ చేసాడు. ‘నీ కాళ్లను పట్టుకు వదలవన్నవి చూడే నా కళ్లు’. "సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా" లాంటి పాట‌లు పాడి శ్రోత‌ల‌ను అల‌రించాడు. ఈ సినిమా సాంగ్స్ మిలియ‌న్ వ్యూవ్స్ క్ల‌బ్ లో చేర‌డ‌మే కాకుండా సిద్ కు పేరు వ‌చ్చింది.



ఇక హుషారు, 30రోజుల్లో ప్రేమించ‌డం ఎలా లాంటి సినిమాల్లో సిద్ పాడిన "ఉండిపోరాదే పాట‌, నీలినీలి ఆకాశం పాట" ఈ సినిమాల‌కే ప్ర‌మోష‌న్ గా మార‌యి. పాట‌లు హిట్ అవ్వ‌డంతో సినిమా విడుద‌ల‌కు ముందే జ‌నాల్లోకి వెళ్లింది. అంతే కాకుండా సిద్ ఇటీవ‌ల విడుద‌లైన వ‌కీల్ సాబ్ సినిమాలోమ‌గువా మ‌గువా అనే పాట‌తో క‌న్నీరు పెట్టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: