చిత్ర పరిశ్రమలో అను ఇమాన్యుయేల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు నాచురల్‌ స్టార్‌ నాని సరసన మజ్ను మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమాన్యుయేల్‌. ఆ తర్వాత ఈ భామ అల్లు అర్జున్‌, పవన్‌కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టినా ఈ అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. ఇక తన సినీ జీవితంలో ఇంతరకు ఆశించిన స్థాయిలో హిట్‌ పడలేదు.

అయితే అను ఇమాన్యుయేల్‌ ఈ మధ్య కుర్రహీరో అల్లు శిరీష్‌తో లవ్‌ ట్రాక్‌ కొనసాగిస్తుందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఇప్పటివరకు ఏ హీరోయిన్‌ తోనూ రూమర్స్‌ రాని శిరీష్‌ ఈ మధ్యకాలంలో అను ఇమాన్యుయేల్‌ తో క్లోజ్‌ అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్స్‌ పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించకపోవడంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. ఈ వార్తపై ఎవరో ఒక్కరు స్పందిస్తే గాని అసలు నిజం ఏంటో తెలీదు.


ఇక ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. ఫోటో షూట్‌ లతో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తుంటుంది. అయితే తాజాగా లాంగ్‌ వైట్‌ కలర్‌ షర్ట్‌ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను షేర్‌ చేయగా ఓ నెటిజన్‌ నుంచి ఊహించని విధంగా రిప్లయ్ వచ్చింది. అయితే అతడు ఏం రిప్లయ్ ఇచ్చాడు చూద్దామా. మీరు నన్ను పెళ్లిచేసుకుంటారా? నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గార్డెన్‌తో కూడిన ఓ అందమైన ఇళ్లు ఉంది. అలాగే ఓ స్కూటర్‌ కూడా ఉంది. వీటన్నింటికి మించి మీపై బోలెడంత ప్రేమ ఉంది అంటూ లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. దీంతో ఈ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: