జ‌బ‌ర్ధ‌స్త్‌, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంక‌ర్‌గా  పాపుల‌ర్ అయిన ర‌ష్మీ అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌ని లేదు.ఇప్ప‌టికీ 16ఏళ్ల ప‌డుచుపిల్ల‌లా క‌నిపిస్తుంది ఈ అందాల భామ‌.అంతేకాదు ర‌ష్మీ సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు.త‌న అఫీసియల్ ఫేస్‌బుక్ పేజ్‌లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తున్న ఫోటోల‌ను షేర్ చేస్తుంది.ఆమె ఫేస్‌బుక్ పేజీకి 4.9మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.ర‌ష్మీ పెట్టిన ప్ర‌తి ఫోటోకి నిమిషాల్లో వేల‌ కామెంట్స్ వ‌స్తాయి.ర‌ష్మీ జంతుప్రేమికురాలు...ఆమె ఎక్కువగా సమాజం గురించి స్పందిస్తూ ఉంటారు. సమాజంలోని అసమానతలు, మూగజీవాల రక్షణ కోసం పాటు పడుతూ ఉంటారు. రష్మీ తన ఇంట్లో పెంపుడు జంతువులతో ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మూగ జీవాల మీద జరిగే హింసను ఖండిస్తూనే ఉంటారు. సంప్రదాయాల పేరిట జంతువులను బలి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంటారు.మానవ జాతి అంతా కలిసి మిగతా జీవిరాశులను ఎలా హింసిస్తున్నారు.. ఒక వేళ వాటి స్థానంలో మనం ఉండి.. మనస్థానంలో అవి ఉంటే పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఊహించుకోండి.. అది మీకు సమ్మతమేనా? అంటూ ఇలా ఎన్నెన్నో ప్రశ్నలను సంధించారు.
https://www.facebook.com/100044571153330/videos/523317251885072
జ‌బ‌ర్ధస్త్ క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీకి మ‌ధ్య ఎఫైర్స్ ఉందంటూ పుకార్లు మాత్రం చాలా వ‌చ్చాయి.వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటారంటూ జోరుగా ప్ర‌చారం సాగింది.ఏ షో అయిన సుధీర్ -ర‌ష్మీల జోడీ కనిపించిందంటే ఇక మాములుగా ఉండ‌దు.వీరిద్ద‌రి మ‌ధ్య సాగే సంభాష‌ణ కూడా నిజంగానే వీరిమ‌ధ్య ఎదో ఉందనేలా సాగుతుంది.ర‌ష్మీ-సుధీర్‌ల గురించి యూట్యూబ్‌లో ఎన్నివిడియోలు ఉంటాయో చెప్ప‌న‌వ‌స‌రం లేదు.చాలా కాలం నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య వ‌స్తున్న పుకార్ల‌కు ఎప్పుడు ఫుల్‌స్టాప్ ప‌డుతుందో తెలియ‌డం లేదు.


ర‌ష్మీ కేరీర్ 2002లో స‌వ్వ‌డి అనే సినిమాతో ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ ఆ సినిమా విడుద‌ల కాలేదు. ఆ త‌రువాత ఉద‌య్ కిర‌ణ్ హీరోగా న‌టించిన హోలీ సినిమాలో ఆమె స‌హాయ పాత్ర పోషించింది.అలా కేరీర్ ప్రారంభించిన ర‌ష్మీ ఈటీవీ, జెమిని ఛానెల్లో వ‌చ్చే కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది.ప్ర‌ముఖంగా ఈటీవీలో వ‌చ్చే జ‌బ‌ర్ధ‌స్త్‌, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంక‌ర్ గా ర‌ష్మీ బాగా పాపుల‌ర్ అయింది. దీంతో ర‌ష్మీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరింగింది.దీనికి తోడు ర‌ష్మీ అందం కుర్రాకారును కైపెక్కించేలా ఉంటుంది.ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెలుగు టీవీ యాంక‌ర్‌ల‌లో అన‌సూయ త‌రువాత అంత‌గా ఫ్యాన్స్ ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకున్న యాంక‌ర్ ర‌ష్మీనే.

మరింత సమాచారం తెలుసుకోండి: