హీరో హీరోయిన్లకు స్కూల్, కాలేజీ టైమ్ లో ఏవైనా లవ్ స్టోరీలు ఉంటే.. వాళ్లు స్టార్లు అయ్యాక అవి మరింత సెన్సేషన్ అవుతాయి. అయితే కొంతమంది మాత్రమే తమ పర్సనల్ లైఫ్ గురించి రివీల్ చేస్తుంటారు. అలా పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఓ లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది హీరోయిన్ కీర్తి సురేష్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకు ఎదురైన ఓ అనుభవాన్ని వివరించింది. ఆ యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంది.

ఇటవల ఓ ఇంటర్వ్యూలో తన లవ్ మేటర్ గురించి చెప్పింది కీర్తి సురేష్. స్కూల్ నుండి కాలేజీ వరకు అసలు లవ్ ప్రపోజల్స్ రాలేదని చెప్పింది కీర్తి సురేష్. అసలు విషయం ఏంటంటే.. ఈ అమ్మడు చదివింది మొత్తం గర్ల్స్ క్యాంపస్ లోనే. గర్ల్స హై స్కూల్, ఆ తర్వాత గర్ల్స్ కాలేజీ. ఇక లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఎక్కడుంది. అయితే సినిమాల్లోకి వచ్చాక మాత్రం తనకి కుప్పలు తెప్పలుగా లవ్ ప్రపోజల్స్ వచ్చాయని చెబుతోంది కీర్తి. ఓ వీరాభిమాని చాలా సిన్సియర్ గా ప్రపోజ్ చేశాడని, అయితే తాను ఎవరినీ యాక్సెప్ట్ చేయలేదని అంటోంది. సినిమా హీరోయిన్లంటే చాలామందికి క్రష్ ఉండటం సహజమే. అయితే వారిలో ఎవరో కొంతమందే ప్రపోజ్ చేసే ధైర్యం చేస్తారు. అలాంటి ధైర్యవంతుల్లో కూడా ఒక్కరు మాత్రం కీర్తి హార్ట్ ని టచ్ చేశాడు. ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్ గురించి ఇప్పటికీ గుర్తించుకుని చెబుతుంది కీర్తి సురేష్.

ఇక కీర్తి పెళ్లిపై కూడా ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. ఆమధ్య కీర్తి సురేష్, ఎవరో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుందని, సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందనే వార్తలొచ్చాయి. మొదట్లో ఈ విషయాల్ని తేలికగా తీసిపారేసినా, పుకార్లు ఎక్కువయ్యే సరికి స్వయంగా ఆమే రంగంలోకి దిగింది. ఇప్పట్లో లవ్-మేరేజ్ అనే విషయాలపై తనకు ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. అలాంటివి ఏదైనా ఉంటే ముందుగా సోషల్ మీడియాలో తానే అప్ డేట్ చేస్తానని చెప్పింది. అక్కడితో ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది కీర్తి సురేష్. మహానటి సినిమాతో మంచి పాపులార్టీ తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఇప్పుడిప్పుడే సౌతిండియాలో స్టార్ హీరోల సరసన అవకాశాలు తెచ్చుకుంటోంది. పవన్ కల్యాణ్ తో చేసిన సినిమా నిరాశ పరిచినా, ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సర్కారువారి పాట తనకు మంచి గుర్తింపు తెస్తుందని ఆశపడుతోంది కీర్తి. 

మరింత సమాచారం తెలుసుకోండి: