
హీరోయిన్స్ అంతా కూడా ప్రేక్షకులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ తమ సినిమాల ప్రమోషన్స్ ను సోషల్ మీడియా వేదికగా చేసుకుంటూ ఉంటారు. దిశా పటాని అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారును మత్తులో దించుతుంటుంది. ఇలా చేస్తుంటేనే ఫ్యాన్స్ కొంతకాలమయినా వీరిని గుర్తు పెట్టుకుంటారు. ఇది ఇలా ఉంటే లేటెస్ట్ గా ఈమె ఫిట్నెస్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈమెకు తన ఫిట్నెస్ పై ఎంత శ్రద్ద ఉందో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. దిశా జిమ్ లో తాను చేసిన ఒక బ్యాక్ ఫ్లిప్ వీడియో ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది మరియు ఆశ్చర్యచకితులను చేస్తోంది. దిశా ఒక ఎత్తైన వేదిక మీద నుండి చాలా సున్నితమైన బ్యాక్ ఫ్లిప్ చేసింది.
ఈ ఫ్లిప్ చేసే సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో ఒక మంచి మ్యూజిక్ వస్తూ ఉంది. దీనితో ఈమెకు వర్క్ ఔట్స్ చేసే సమయంలో మ్యూజిక్ వినడం అలవాటని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఫ్లిప్ ఒక వెన్నలాంటిదని పోస్ట్ లో పెట్టింది. ఈ వీడియోను చూసిన దిశా ప్రేమికుడు టైగర్ ష్రాఫ్ అవాక్కయ్యాడు. దిశా యొక్క నైపుణ్యాన్ని అభినందించాడు. ఇతను మాత్రమే కాకుండా సుస్సాన్ ఖాన్ మరియు పునీత్ మల్హోత్రా లు కూడా ఈమెను ప్రశంసించారు.